కేరళలో కామంధులు రెచ్చిపోయారు.. కాలేజీలో ఉన్న యువతిని తీసుకెళ్లి మత్తు మందు ఇచ్చి, అతి దారుణంగా అత్యాచారం చేసిన ఘటన వెలుగు చూసింది..అమ్మాయి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదు ఆధారంగా నిందితుడిని గుర్తించి విచారణ కొనసాగిస్తున్నారు..
వివరాల్లోకి వెళితే..మే 30న, మొదటి సంవత్సరం చదువుతున్న మహిళా గ్రాడ్యుయేట్ అదృష్యమైంది… తరువాత ఆమెకు మత్తుఇచ్చి ర్యాప్ అతి దారుణంగా రేప్ చేశారు.. ఆ తర్వాత వయనాడ్‌ను కోజికోడ్‌ను కలిపే తామరస్సేరి చురంకు పర్వతం దగ్గర వదిలివేశారు… తామరస్సేరి పోలీస్‌స్టేషన్ పరిధిలోని తన కళాశాల సమీపంలో మహిళ పేయింగ్ గెస్ట్‌గా ఉంటోందని అది గ్రహించి కాపు కాసి అపహారించినట్లు పోలీసుల వివరాలల్లో తెలిపారు..
అయితే, నేరం జరిగిన రోజు ఆమె అందుబాటులోకి రాకపోవడంతో కుటుంబ సభ్యులు మిస్సింగ్ ఫిర్యాదు చేశారు. విచారణ జరుగుతుండగానే మహిళ తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసింది.. అనంతరం ఆమెను పోలీసులు రక్షించారు. శుక్రవారం, ప్రాణాలతో బయటపడిన అమ్మాయి నుంచి వివరాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు.. ప్రస్తుతం ఆమెకు వైద్యాన్ని అందిస్తున్నారు.. ఈ ఘటన బయటకు తెలియడంతో రాష్ట్రం మొత్తం ఉలిక్కి పడింది.. ఈ ఘటన గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి..