NTV Telugu Site icon

Karnataka: ప్రియురాలితో పారిపోయిన కొడుకు.. తల్లిని స్తంభానికి కట్టేసి కొట్టారు..

Karnataka

Karnataka

Karnataka: కొడుకు చేసిన తప్పుకు తల్లి శిక్షకు గురైంది. కర్ణాటకలో ఓ యువకుడు తన ప్రియురాలితో పారిపోయాడు. దీంతో యువతి కుటుంబం 50 ఏళ్ల మహిళను స్తంభానికి కటేసి కొట్టారు. మహిళ ఫిర్యాదుతో ముగ్గురిని అరెస్ట్ చేశారు. మహిళ కుమారుడు గ్రామంలోని తన ప్రియురాలితో పారిపోయాడు. దీంతో తల్లి హనుమవ్వ కోమ్‌ని పారిపోయిన యువతి కుటుంబ సభ్యులు దాడి చేశారు. ఈ సంఘటన ఏప్రిల్ 29న హవేరీ జిల్లా అరెమల్లాపూర గ్రామంలో జరిగింది.

Read Also: Wife Tortures: ఆస్తి కోసం భర్తను బంధించి హింసించిన భార్య.. పోలీసుల జోక్యంతో..

గ్రామానికి చెందిన పూజ, మంజునాథ్ ఇద్దరు గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల వీరద్దరు పారిపోయారు. పారిపోయిన విషయం పూజ కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు హనుమవ్వ ఇంటికి వెళ్లి, ఆమెను బయటకు లాగి దాడికి పాల్పడ్డారు. అనంతరం విద్యుత్ స్తంభానికి కట్టి నిర్దాక్షిణ్యంగా కొట్టారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని బాధిత మహిళను రక్షించారు. మహిళ ఫిర్యాదు మేరకు ఐపీసీ 324, 354 బీ, 504, 506, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ కొనసాగుతోంది.