Site icon NTV Telugu

Karnataka : కాపురంలో చిచ్చుపెట్టిన ఫోన్.. అతి కిరాతకంగా భార్యను హత్య చేసి..

Crime

Crime

ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ లేకుండా ఎవ్వరు ఉండరు.. ఆ ఫోన్ ఎందరి కాపురాలను కూల్చిందోమారేందరి ప్రాణాలను బలిగొనిందో చెప్పనక్కర్లేదు.. తాజాగా మరో దారుణ ఘటన వెలుగు చూసింది.. ఫోన్ మాట్లాడుతుందని భార్యను అతి దారుణంగా భర్త చంపిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.. ఈ దారుణ ఘటన కర్ణాటక లో చోటు చేసుకుంది…

వివరాల్లోకి వెళితే.. తుమకూరు జిల్లా పావగడ తాలూకాలోని వైఎన్‌ హొసకోట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బూదిబెట్ట గ్రామంలో భర్త చేతిలో భార్య హత్య కు గురైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. లక్ష్మి, రామాంజినప్ప దంపతులు, వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.. ఈ మధ్య భార్య ఎవరితోనో ఫోన్ లో మాట్లాడింది.. ఆ మాటలను తలుపు చాటున భర్త విన్నాడు.. అనుమానంతో రగిలిపోయాడు, దీనిపై గ్రామంలో పెద్ద మనుషుల తో పంచాయతీ పెట్టించగా వారు నచ్చజెప్పారు. కానీ రామాంజినప్ప ఆమెను కడ తేర్చాలని నిర్ణయించుకున్నాడు..

తనని దారుణంగా మోసం చేసిన భార్యను ఎలాగైనా చంపెయ్యాలని ప్లాన్ చేసుకున్నాడు.. రాత్రి భార్య నిద్రిస్తుండగా రోకలిబండతో తలపై బాదాడు. ఆమెను బయటకు ఈడ్చుకు వచ్చి మళ్లీ బండరాయి తో తల పై కొట్టి హత్య చేశాడు. ఈ దుర్ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పోలీసు ఉన్నతాధికారులు ఘటనాస్థలిని పరిశీలించారు.  మృత దేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.. ఈ ఘటన స్థానికంగా భయ బ్రాంతులకు గురించి చేసింది..నిందితున్ని అరెస్టు చేయడం తో తల్లీ, తండ్రి లేని అనాధలు అయ్యారు పిల్లలు.. వారిని చూసి స్థానికులు కన్నీళ్లు పెట్టుకున్నారు..

Exit mobile version