NTV Telugu Site icon

Prostitution Racket: బయట మసాజ్.. లోపల పాడుపని.. ఇద్దరు మహిళలు అరెస్ట్

Hosur Prostitution

Hosur Prostitution

Karnataka Police Busted Prostitution Racket In Hosur: మసాజ్ సెంటర్ మాటున వ్యభిచారం దందా నిర్వహిస్తున్న ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. పైకేమో మంచి కలరింగ్ ఇస్తూ.. లోపలోమో పాడుపనులకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి దందానే నిర్వహిస్తున్న ఒక ముఠాను హోసూరు పోలీసులు అరెస్ట్ చేశారు. తమకు అందిన సమాచారం ప్రకారం.. మంగళవారం రాత్రి పోలీసులు ఒక్కసారిగా ఓ మసాజ్ సెంటర్‌లో దాడి చేశారు. దీంతో.. ఇద్దరు మహిళలు, ముగ్గురు వ్యక్తులు అడ్డంగా బుక్కయ్యారు. ఈ దందాను కేరళకు చెందిన రామ్‌శాంత్ నిర్వహిస్తున్నట్టు గుర్తించిన పోలీసులు.. అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన ఇద్దరు మహిళలు వేలూరు జిల్లాకు చెందినవారిగా తేలింది.

Free Fire Love Story: పబ్జీ ప్రేమ తరహాలోనే ఫ్రీ ఫైర్ గేమ్ లవ్ స్టోరీ.. ఇంటి నుంచి జంప్

ఇటు హైదరాబాద్‌లోనూ పోలీసులు పలు మసాజ్ సెంటర్లపై దాడులు నిర్వహించి.. లోపల అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని అరెస్ట్ చేశారు. కొందరైతే.. సినిమాల ఆఫర్లు, ఉద్యోగాల పేరుతో ఇతర రాష్ట్రాలకు చెందిన యువతుల్ని ఇక్కడికి రప్పించి, ఇక్కడ వారితో వ్యభిచారం చేయిస్తున్నట్టు తేలింది. ఇలా ఈ రొంపి నుంచి కొందరు యువతుల్ని పోలీసులు కాపాడుతున్నారు. చట్టప్రకారం వ్యభిచారం నేరమని తెలిసినా.. కొందరు తెగించి ఈ కార్యకలాపాల్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో, పోలీసులు వరుస దాడులు నిర్వహిస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే.. బంజారాహిల్స్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నిర్వహిస్తున్న వ్యభిచార రాకెట్‌ను కమిషనర్‌ టాస్క్‌ఫోర్స్ బృందం ఛేదించింది. 10 మంది మహిళలను రక్షించి.. ముగ్గురు నిర్వాహకులు, 18 మంది కస్టమర్లను పట్టుకున్నారు.

Daya Web Series: దయా వెబ్ సిరీస్ ఒక సినిమాలా ఆపకుండా చూసేస్తారు…

Show comments