Karnataka: ప్రొఫెసర్‌తో ఎఫైర్ ఉందని రూమర్స్.. వైద్య విద్యార్థిని ఆత్మహత్య..

  • ప్రొఫెసర్‌తో ఎఫైర్ ఉందని రూమర్స్..
  • మానసిక క్షోభతో విద్యార్థిని ఆత్మహత్య..
Student Suicide

Student Suicide

Karnataka: కర్ణాటకలో విషాదం చోటుచేసుకుంది. ప్రొఫెసర్‌తో ప్రేమ వ్యవహారం ఉందనే రూమర్‌ ఒక వైద్య విద్యార్థి ప్రాణాన్ని బలిగింది. ఈ వదంతులు వ్యాపించడంతో 22 ఏళ్ల యువతి ఆత్మహత్య చేసుకుంది. బాధితురాలు కర్ణాటకలోని మల్లాడిహళ్లిలో ఉన్న రాఘవేంద్ర ఆయుర్వేద కళాశాలలో నిఖిత బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ (BAMS) చివరి సంవత్సరం చదువుతోంది.

Read Also: Congress MLA Rajendra Bharti: కాంగ్రెస్ ఎమ్మెల్యేకి మూడేళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా.. ఎందుకంటే?

విద్యార్థిని తండ్రి ఉమాశంకర్ జి ఎన్ ఫిర్యాదు ప్రకారం.. నిఖితకు కాలేజీలోని డాక్టర్ రాజు అనే లెక్చరర్‌తో సంబంధం కలిగి ఉందని కొందరు విద్యార్థులు పుకార్లు వ్యాప్తి చేశారని ఆయన ఆరోపించారు. తోటి విద్యార్థులు పదే పదే ఎగతాళి చేయడంతో తన కుమార్తె అవమానాన్ని తట్టుకోలేక, మాసిసిక క్షోభ అనుభవించిందని ఉమాశంకర్ ఆరోపించారు. ఇలాంటి వ్యాఖ్యలను పట్టించుకోకుండా చదువులపై దృష్టి పెట్టాలని తాను సూచించానని, వేధింపులు పదే పదే కొనసాగడంతోనే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. మానసిక ఒత్తిడిని తట్టుకోలేక నిఖిత బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆత్మహత్య చేసుకుంది. తన కుమార్తె మరణానికి కారణమైన సహ విద్యార్థుల పేర్లను పేర్కొంటూ, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఉమాశంకర్ ఫిర్యాదు చేశారు.