Doctor Doom of Kanpur : 12వ తరగతి చదివి.. వందకు పైగా కిడ్నీ ఆపరేషన్లు చేసిన కిలాడీ నకిలీ డాక్టర్.!
- నకిలీ డాక్టర్ల కిడ్నీ రాకెట్
- డిగ్రీ లేకుండా వందల ఆపరేషన్లు
- పేదలే బలిపశువులు
- పలు రాష్ట్రాల్లో విస్తరించిన నెట్‌వర్క్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైద్యం అనేది ప్రాణాలను కాపాడే వృత్తి. కానీ ఉత్తరప్రదేశ్‌లో కొందరు కేటుగాళ్లు దీన్ని ఒక మాఫియాగా మార్చేశారు. ఎటువంటి మెడికల్ డిగ్రీలు లేవు, కనీసం ఆపరేషన్ థియేటర్ నిబంధనలు తెలియవు. అయినా చేతిలో కత్తి పట్టి వందలాది కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ శస్త్రచికిత్సలు చేసేశారు. కాన్పూర్ పోలీసులు జరిపిన మెరుపు దాడుల్లో ఈ చీకటి సామ్రాజ్యం గుట్టురట్టు అయింది.
ఈ కిడ్నీ రాకెట్‌లో అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి ముదస్సర్ అలీ. ఇతనికి ఎలాంటి వైద్య అర్హతలు లేవు. కానీ ఒక అనుభవజ్ఞుడైన సర్జన్ లాగా ఆపరేషన్లు చేసేవాడు. ఆపరేషన్ థియేటర్‌లోకి వెళ్ళిన తర్వాత ఎవరినీ లోపలికి రానివ్వకుండా, కిడ్నీ తీయడం నుండి దానిని మరొకరికి అమర్చడం వరకు మొత్తం ప్రక్రియను తానే స్వయంగా పూర్తి చేసేవాడు. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, ఇతను ఒక్కడే 100కు పైగా నకిలీ ఆపరేషన్లు చేసినట్లు తెలుస్తోంది.
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
ఈ ముఠాలో మరో కీలక వ్యక్తి రోహిత్. ఇతను కేవలం 12వ తరగతి (ఇంటర్మీడియట్) వరకు మాత్రమే చదివాడు. కానీ తెల్లటి కోటు, స్టెతస్కోప్ ధరించి డాక్టర్‌లా నటించేవాడు. దాదాపు 30కి పైగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్లు చేసినట్లు ఇతను అంగీకరించాడు. ఒక్కో ఆపరేషన్‌కు రూ. 18 లక్షల వరకు వసూలు చేసి, ఆ డబ్బును తన నెట్‌వర్క్‌లోని ఇతరులతో పంచుకునేవాడు. పోలీసుల నుండి తప్పించుకోవడానికి గోవా, షిమ్లా, మనాలీ మీదుగా నేపాల్‌కు పారిపోగా, ఎట్టకేలకు పోలీసులు అతన్ని పట్టుకున్నారు.
డబ్బు కోసం కిడ్నీ అమ్ముకోవాలనుకునే పేదలను, జీవితాన్ని కాపాడుకోవడానికి ఎంతైనా ఖర్చు చేసే ధనవంతులను ఈ ముఠా అనుసంధానించేది. ఒక బాధితుడికి ఇస్తామన్న రూ. 10 లక్షలు ఇవ్వకపోవడంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ నకిలీ డాక్టర్లు చేసిన ఆపరేషన్ల వల్ల బాధితుల పరిస్థితి దారుణంగా మారింది. పారుల్ అనే మహిళ లక్షలు ఖర్చు చేసినా తీవ్రమైన ఇన్ఫెక్షన్ బారిన పడగా, మరో ఘటనలో ఒక మహిళ ఆపరేషన్ విఫలమై ప్రాణాలు కోల్పోయింది.
TCS Nashik Case: “నీ భార్యను నా దగ్గరికి పంపు”.. టీసీఎస్ నాసిక్ కేసులో సంచలన విషయాలు..
ఈ కిడ్నీ దందా కేవలం కాన్పూర్‌కే పరిమితం కాలేదు. పలు రాష్ట్రాల్లోని ప్రైవేట్ ఆసుపత్రులు, మధ్యవర్తులు మరియు నకిలీ డాక్టర్లతో కూడిన ఒక భారీ నెట్‌వర్క్ దీని వెనుక ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు బయటపడినవి కొన్ని మాత్రమేనని, ఇంకా వందలాది ఆపరేషన్లు రికార్డుల్లో లేకుండా జరిగి ఉండొచ్చని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఈ కేసులో ఇంకా ఎంతోమంది కీలక వ్యక్తులు పరారీలో ఉన్నారు, వారి కోసం వేట కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!