NTV Telugu Site icon

Jubilee Hills Case: బాలికపై గ్యాంగ్ రేప్.. ఆ గంటన్నర ఏం జరిగింది..?

Jubli Hils

Jubli Hils

ఒక్క గ్యాంగ్ రేప్.. వందల మిస్టరీలు.. పోలీసులకు అంతుచిక్కని రీతిలో సినిమా సస్పెన్స్ మాదిరిగా గ్యాంగ్ రేప్ విచారణ కొనసాగుతోంది. ఆ గంటన్నర పాటు ఏం జరిగింది. గంటన్నరలో 5 గురు కలిసి గ్యాంగ్ రేప్ చేశారు. గంటన్నరలో బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ రోడ్డులు మొత్తాo తిరిగి నిర్మానుష్య ప్రాంతాన్ని ఎంచుకొని బాలికపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు.. పోలీసులు విచారణ చేస్తున్న కొద్దీ కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పలు అనుమానాలు కూడా ఈ కేసులో బయటపడుతున్నాయి. ఒక మాజీ ఎమ్మెల్యే మనవడు ఉమర్ ఖాన్.. ఎంఐఎం కు చెందిన ఒక కీలక నేత కుమారుడు సాద్దిన్ మాలిక్, వక్ఫ్ బోర్డు చైర్మన్ కుమారుడు.. హైదరాబాద్ నగర కార్పొరేటర్ చెందిన కుమారుడు.. సంగారెడ్డి కి చెందిన కార్పొరేటర్ కుమారుడు.. పాతబస్తీకి చెందిన ఎం.ఐ.ఎం ఎమ్మెల్యే కుమారుడు వీళ్లతో పాటు ఒక ఆటో డ్రైవర్ కుమారుడు కూడా ఉన్నాడు.. ఈ అందరు కూడా హైదరాబాద్ నగరంలోని వివిధ కార్పొరేట్ కాలేజీలో చదువుకున్న వాళ్ళే.. వీళ్ళందరూ కూడా జూబ్లీహిల్స్ బంజారా హిల్స్ ప్రాంతంలో నివాసముంటున్నారు. అందరి తండ్రులు కూడా రాజకీయ నేతలు కావడం తో పాటుగా వీళ్ళందరికీ వ్యక్తిగతంగా పరిచయాలు ఉన్నాయి. అందరికీ కూడా విపరీతమైన డబ్బులు ఉండడంతో జల్సాలు చేయడం వీరికి అలవాటు. ఈ ఆరుగురు పిల్లలు కలిసి ప్రతినిత్యం కూడా పబ్బులు, బార్లు, ఫాం హౌస్, రెస్టారెంట్ లో ఎంజాయ్ చేస్తారు. గత నెల 28వ తేదీన పబ్ పార్టీ జరుగుతున్నట్టుగా వీళ్ళకు ఇన్స్టాగ్రామ్ ద్వారా సమాచారం వచ్చింది. ఆ పార్టీకి వీళ్లు వెళ్లాలనుకున్నారు. ఇందులో భాగంగానే ఆరుగురు కలిసి వివిధ టైములో పబ్ కు చేరుకున్నారు. అదే టైమ్ లో బాధిత బాలిక తో పాటు మరో బాలిక పబ్ కి వచ్చారు.

ఒక కార్పొరేటర్ కుమారుడు తో పాటు మాలిక్ కలిసి ముందుగా బాధిత బాలికతో పాటు మరొక బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. డాన్స్ ఫ్లోర్ మీద ఎంజాయ్ చేస్తున్న బాలికలను ఇద్దరు కలిసి వేధించారు. ఇద్దరు బాలికలు ఎలాగైనా వీళ్ళను వశపరచుకొని ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఇద్దరు బాలికలు కూడా డాన్స్ ఫ్లోర్ మీద వీళ్ళని ఛీ కొట్టారు. అంతేకాకుండా పిచ్చి పిచ్చి పనులు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంఘటన జరిగిన తర్వాత బాధిత బాలికతో పాటు కలిసి ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అప్పటికి సమయం ఐదున్నర గంటలు అవుతుంది. ఇదిలా ఉంటే పబ్ లో కనీస సెక్యూరిటీ కరువైంది. దాదాపు 182 మంది పార్టీకి హాజరయ్యారు. పార్టీకి వచ్చిన వారిని తనిఖీ చేయలేదు. అంతేకాకుండా మాక్ టైల్ పార్టీ కావడంతో పిల్లలు కొద్దిగా నిషాలో ఉండిపోయారు..పబ్బు కేవలం డబ్బులు కోసం ఆశ పడి ఉంది కానీ అక్కడ జరుగుతున్న అరాచకాలకు అడ్డుకట్ట వేయలేకపోయింది. బాలికల పట్ల యువకులు అసభ్యంగా ప్రవర్తిస్తున్నా చూసీచూడనట్టుగా వదిలి పెట్టారు. కనీసం అరాచకాలు చేస్తున్న పిల్లల్ని బౌన్సర్లు హెచ్చరికలు కూడా చేయలేదు.. మధ్యాహ్నం సమయాల్లో పబ్ లో ఇలాంటి పార్టీలు నిత్యకృత్యంగా జరిగిపోతుంటాయి. కొంతమంది ఈవెంట్ మేనేజర్ లతో యజమానులు ఇలాంటి పార్టీలు నిర్వహిస్తుంటారు. పబ్ లోపలికి మైనర్లను అనుమతించకూడదని ఎక్సైజ్ ,పోలీస్ శాఖ చెప్తుంది. 21 సంవత్సరాల లోపు ఉన్న మైనర్లు లోపలి ప్రవేశించకూడదు.. ఇక ఎట్టి పరిస్థితిలో వారికి మద్యం సరఫరా చేయకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ పబ్ యజమానులు డబ్బుల కోసం కక్కుర్తిపడి ఈవెంట్ మేనేజర్ లతో కలిసి డబ్బులు దండుకుంటున్నారు.

పబ్ యజమానులు ఇన్స్టాగ్రామ్ లో ఒక పేజీని మెయింటెన్ చేస్తారు. ఏ రోజు ఎక్కడ పార్టీ జరుగుతుంది.. పార్టీలో ఎవరు పాల్గొంటారు.. ఏ కాలేజీ విద్యార్థులు వస్తున్నారనే విషయాన్ని ఎప్పటికప్పుడు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇకపోతే పబ్బులో ఇద్దరు బాలికల మధ్య ఈ గ్యాంగు అరాచకంగా ప్రవర్తించింది. అయితే అక్కడున్న బౌన్సర్లు యువకుల్ని ఎందుకు అడ్డుకోలేదు..? ఎందుకు చూసీచూడనట్టుగా వదిలి పెట్టారు..? పబ్ బయటికి హడావిడిగా ఇద్దరు బాలికలు రావడం జరిగింది. అప్పుడు కూడా అక్కడున్న సిబ్బంది ఎందుకు బాలికలను ప్రశ్నించలేదు..? ఇద్దరు అమ్మాయిల వెనకాల గ్యాంగ్ మొత్తం.. పబ్బు లోపల్నుంచి పార్కింగ్ ఏరియా వరకు వెంట పడుతున్నప్పటికీ ఎవరు ఎందుకు చూడకుండా పోయారు..? పబ్బు బయటికి వచ్చిన తర్వాత బాధిత బాలికతో ఉన్న మరో బాలిక హడావుడిగా క్యాబ్ బుక్ చేసుకుని వెళ్లిపోయింది. అంట హడావిడిగా వెళ్తున్నా అక్కడే నిలబడ్డ సెక్యూరిటీ గార్డు ఎందుకు పట్టించుకోలేదు..? ఇక అమ్మాయిని గ్యాంగ్ మొత్తం ట్రాప్ చేసింది. ఈ విషయాన్ని కూడా అక్కడ ఉన్న సిబ్బంది పట్టించుకోకుండా వదిలేశారు. ఇకపోతే అమ్మాయిని ని బెంజ్ కార్ లో మధ్యలో కూర్చోబెట్టి తీసుకొని వెళ్ళిపోయారు. ఈ సమయంలో కూడా పబ్ సిబ్బంది ఈ వ్యవహారాన్ని చూస్తూనే ఉన్నారు కానీ ఎవరినీ వారించలేదు.

ఇకపోతే బెంజ్ కార్ లో అమ్మాయిని ఎక్కించుకొని బేకరీ వరకు వెళ్లారు. అక్కడ అందరూ కలిసి ఫుడ్ తీసుకున్నారు. అదే సమయంలో అమ్మాయికి పదే పదే ఫోన్ కాల్స్ రావడం మొదలయ్యాయి. దీంతో ఫోన్ ఆన్సర్ చేయకుండా వారువారించారు.. తనకూ ఫోన్ కాల్స్ వస్తున్నాయని చెప్పి అమ్మాయి పదేపదే చెప్పడంతో తిరిగి పబ్ దగ్గర డ్రాప్ చేద్దామని యువకులంతా కలిసి చెప్పారు. ఈ నేపథ్యంలోనే అందరూ కలిసి బెంజ్ కార్లో బయలుదేరారు. కొంత దూరం వెళ్ళాక బెంజ్ కార్ లో పెట్రోల్ అయి పోయిందని చెప్పి ఒక నాటకం ఆడారు. తమ వెనకాల వస్తున్న ఇన్నోవా కార్లో అమ్మాయిని తరలించారు. అక్కడి నుంచి అమ్మాయి ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. గంటన్నరలో వారు చేసిన పనులు ఇవి. ఇక ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏం చేస్తున్నారు అనే దాని గురించి ఇప్పుడు చర్చ మొదలైంది. ఎందుకంటే పబ్ లో ఏం జరిగింద..? పార్కింగ్ ఏరియా లో ఏం జరిగింది..? కార్లు ఎక్కిన తర్వాత ఏం చేశారు..? ఎమ్మెల్యే కుమారుడు మధ్యలో ఎందుకు వెళ్ళిపోయాడు..? అత్యంత రద్దీగా ఉండే బంజారాహిల్స్ రోడ్ ఎక్కడ రేప్ చేశారు..? అత్యాచారం జరిగిన వెంటనే అమ్మాయిని పబ్ దగ్గర ఎవరు డ్రాప్ చేశారు..? పబ్ లోపలికెళ్లి అమ్మాయి జాకెట్ ని ఎలా తీసుకొని బయటికి వచ్చారు. ఇంటికి వెళ్ళిన తర్వాత బాలిక అన్యమస్కంగా ఉండడంతో సోదరుడు తండ్రి కలిసి సొంతంగా విచారణ చేశారు.

పబ్ కి వచ్చి అక్కడ ఉన్న సీసీ ఫుటేజీని వెరిఫై చేశారు. సీసీ ఫుటేజ్ ను కొంతమంది అబ్బాయిలు, అమ్మాయిని తీసుకోబోతుండగా గుర్తించారు. అయితే అప్పుడు కూడా యాజమాన్యం ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అయితే వీడియో దొరికిన వెంటనే కాకుండా మూడు రోజుల తర్వాత పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. పోలీసులకు బాధిత అమ్మాయి ఫిర్యాదు చేసిన వెంటనే యువకుల్ని వెంటనే పిక్ అప్ చేసి ఉంటే సమస్యలు వచ్చి ఉండేది కాదని ఉన్నతాధికారులు అంటున్నారు. బెంజ్ కార్ ని సీజ్ చేసిన వెంటనే నిందితులను పట్టుకుంటేఇక్కడివరకు వచ్చేది కాదని అంటున్నారు. తల్లిదండ్రులు ఆ మూడు రోజుల పాటు ఫిర్యాదు ఇవ్వడానికి ఎందుకు వెనుకడుగు వేశారనే దాని మీద పోలీసుల విచారణ కూడా చేస్తున్నారు. ఐదు రోజుల పాటు ఇన్నోవా కారు దొరకకుండా నిందితుడు పూర్తిస్థాయిలో సఫలీకృతమయ్యారు. అయితే ఐదు రోజుల పాటు కారు ఎక్కడ దాచారో ..ఎవరు దాచారో.. దాచిన ఏవెరి సహాయం వీళ్లు పోలీసులు ఎలాంటి సమాధానం చెప్పడం లేదు. అమ్మాయి కి సంబంధించిన వీడియోలు రోజు ఒకటి బయటకు వస్తున్నాయి. ఈ వీడియోని రిలీజ్ చేస్తున్నా వారు ఎవరు అనే విషయాన్ని ఇప్పటివరకు పోలీసులు ఖచ్చితంగా చెప్పట్లేదు. ఎందుకంటే గ్యాంగ్ రేప్ కు పాల్పడిన నిందితుల్లో ఒకరు వీడియో తీశారు. ఆ సోషల్ మీడియాలో ఎలా వస్తున్నాయి. ఇప్పటికే ఆ నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. బయట ఉన్న ఉమర్ ఖాన్ ఈ వీడియోను డిలీట్ చేస్తున్నాడా.. లేకుంటే రాజకీయ పలుకుబడి ఉన్న నిందితుల తల్లిదండ్రులు వీడియోని బయటపెడుతున్నారా అనే విషయం మీద పోలీసులు స్పష్టం చేయడం లేదు.

Show comments