NTV Telugu Site icon

Journalist Tortured: జర్నలిస్టుని చెట్టుకు కట్టేసి టార్చర్.. ఎందుకో తెలుసా?

Journalist Tortured

Journalist Tortured

Journalist Tied To Tree Slapped And Punched In Madhya Pradesh: అతడు ఒక జర్నలిస్ట్.. ఎప్పట్లాగే తన విధులు నిర్వర్తించుకొని ఇంటికి బయలుదేరాడు. గ్రామానికి చేరుకునేంత వరకు క్షేమంగానే చేరుకున్నాడు. కానీ.. ఇంతలోనే ఓ యువకుడు అడ్డగించి, అతనిపై దాడి చేయబోయాడు. ఆ తర్వాత మరో ఇద్దరు రంగంలోకి దిగి, అతనిపై ఎటాక్ చేశారు. చెట్టుకు కట్టేసి మరీ దారుణంగా హింసించారు. ఈ అమానవీయ ఘటన మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశ్ యాదవ్ అనే ఓ యువకుడు ఒక టీవీ ఛానెల్, ఆన్‌లైన్ న్యూస్ ఔట్‌లెట్‌కు జర్నలిస్ట్‌గా పని చేస్తున్నాడు. తన విధులు నిర్వర్తించిన అనంతరం.. తన స్వగ్రామం కోట్‌గావ్‌కి ద్విచక్రవాహనంలో బయలుదేరాడు.

Anurag Thakur: ఢిల్లీ నుంచి కేజ్రీవాల్‌ను తరిమికొడదాం.. కేంద్రమంత్రి ప్రతిజ్ఞ

ఇంతలో నారాయణ్ యాదవ్ అనే ఓ వ్యక్తి ప్రకాశ్ బండిని అడ్డగించాడు. అప్పుడు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. నారాయణ్ బూతులు తిడుతూ ప్రకాశ్‌పై చెయ్యి చేసుకోబోయాడు. ప్రకాశ్ అతడ్ని అడ్డుకోబోతో.. ఇంతలోనే నారాయణ్ సోదరుడు నరేంద్ర యాదవ్, ఓమ్ ప్రకాశ్ అనే మరో వ్యక్తి అక్కడికి చేరుకున్నారు. ఆ ముగ్గురు ప్రకాశ్‌ని రౌండప్ చేసి కొట్టారు. అంతటితో ఆగకుండా.. ఓ చెట్టుకు కట్టేసి, చెంపలు పగలగొట్టారు. అసభ్యకరమైన పదజాలంతో దూషించారు. అనంతరం అతని కట్టు విప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన అనంతరం ప్రకాశ్ పోలీసుల్ని ఆశ్రయించాడు. కొన్ని వారాల క్రితం ఓ అవనసరమైన విషయంపై తమ మధ్య జరిగిన వాగ్వాదానికి ప్రతీకారంగానే తనని ఆ ముగ్గురు ఇలా కట్టేసి కొట్టారని ప్రకాశ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

Dead Body In Truck: లారీలో డెడ్ బాడీ.. షాక్‎కు గురైన ఓనర్

కాగా.. తన ఫిర్యాదులో ప్రకాశ్ పేర్కొన్న ఆ వాగ్వాదానికి సంబంధించి గతంలో ఓ వీడియో వైరల్ అయ్యింది. ఎవరైతే వాగ్వాదానికి దిగారో.. వాళ్లే ఆ వీడియోని రికార్డ్ చేశారు. తామేదో గొప్ప పని చేస్తున్నామన్న ఉద్దేశంతో ఆ పని చేశారు. కానీ.. అదే వాళ్లను జైలుపాలు చేసింది. ఆ ఘటనపై కేసు నమోదవ్వగా.. పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. వారిలో ముగ్గురు ఇప్పుడు ప్రకాశ్‌పై మళ్లీ ఆ వాగ్వాదం విషయంపైనే దాడి చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా.. చర్యలు తీసుకుంటున్నారు.

Jairam Ramesh: ప్రతిపక్ష కూటములకు జైరాం ట్విస్ట్.. బీజేపీపై పోరుకి కాంగ్రెసే పెద్ద దిక్కు