Site icon NTV Telugu

Illegal Affair : ఈమె కామపిశాచికి తక్కువేం కాదు.. మరిది, పెద్ద మరిది.. తరువాత..

Affair

Affair

Illegal Affair : ఉత్తరప్రదేశ్‌ లోని ఝాన్సీ నుంచి బయటకు వచ్చిన ఈ హత్యకథే కాదు.. ఓ కుటుంబాన్ని చీల్చి చెదరగొట్టిన షాకింగ్ డ్రామా. 29 ఏళ్ల పూజా జాటవ్ అనే యువతి చేసిన పనుల మీద ఓ సినిమానే తీయొచ్చు. భర్తను మట్టికరిపించేసింది.. తర్వాత ఇద్దరు బంధువులతో లివ్-ఇన్ రిలేషన్‌లు పెట్టుకుంది.. చివరకు ఆస్తి కోసం సొంతగా అత్తనే హత్య చేయించింది!

పూజా మొదట తన భర్తను కాల్చించేసింది. అతడు చనిపోయాక.. మొదట తన మరిది కల్యాణ్‌తో, అతడు కూడా చనిపోతే.. పెద్ద మరిది సంతోష్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే… పెద్ద మరిదికి పెళ్లై ఒక కూతురు కూడా ఉంది. పూజా, సంతోష్‌ల అక్రమ సంబంధంపై ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. పెద్దమరిది భార్య రాగిని సంతోష్‌తో గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయింది.

ఇక.. పూజాకు తల్లిలాంటి తన అత్త సుశీలాదేవి తనకు వచ్చే భూమిని అమ్మకుండా అడ్డుకుంటుందని భావించింది. అందుకే తన చెల్లి కమలా, ఆమె ప్రియుడు అనిల్‌తో కలిసి ప్లాన్ వేసింది. జూన్ 24న ఉదయం సుశీలాదేవిని హత్య చేసి, ఇంట్లో ఉన్న రూ. 8 లక్షల బంగారాన్ని ఎత్తుకెళ్లారు.

Revanth Reddy: హైకోర్టులో సీఎం క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా..!

అనిల్ పరారీలో ఉండగా.. మంగళవారం రాత్రి బంగారం అమ్మేందుకు వెళ్తున్న అతడిని పోలీసులు పట్టుకున్నారు. అతను కాల్పులు జరపడంతో పోలీసులు ఎదురు కాల్పులు చేశారు. ఫలితంగా అనిల్ గాయపడ్డాడు. అతని దగ్గర నుంచి బంగారం, బైక్, తుపాకీ స్వాధీనం చేసుకున్నారు.

పూజా చెప్పినదాని ప్రకారం.. తనకు వచ్చే 6 ఎకరాల భూమిని అమ్మేసి గ్వాలియర్‌లో సెట్ అవ్వాలని ప్లాన్ వేసిందట. కానీ తన అత్త అడ్డుపడటంతో చంపించాలని నిర్ణయించిందట. ప్రస్తుతం పూజా, ఆమె చెల్లి జైలులో ఉన్నారు. గాయపడ్డ అనిల్‌ను పోలీసులు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

Workplace Harassment: టాయిలెట్‌లో మహిళా ఉద్యోగిని వీడియో తీసిన ఇన్ఫోసిస్ ఉద్యోగి..

Exit mobile version