ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అనేక ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. దీంతో ఎంతో మంది నిరాశ్రయులు అవుతున్నారు. నార్సు ప్రాంతంలో ఓ భవనం కుప్పకూలడంతో.. అక్కడ స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రజలంతా ఇళ్లను ముందే ఖాళీ చేసి వెళ్లి పోయారు. దీంతో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. జమ్ముకశ్మీర్‌లో కురిసిన భారీ వర్షాలకు ఓ భవనం కుప్పకూలిపోయింది. జమ్ముకశ్మీర్‌లోని జాతీయ రహదారిపై నార్సు ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొండచరియలు భవనం పై పడటంతో నేలమట్టం అయ్యింది. ఇటీవల ఇలాంటి ఘటనలే చోటు చేసుకోవడంతో ప్రజలంతా ఇల్లను ఖాళీ చేసి వెళ్లిపోయారు. దీంతో కూలిన సమయానికి భవనంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మరోవైపు కొందరు ఆ భవనం దగ్గరే నిలబడి ఉండగా కూలుతున్న సమయంలో పారిపోయి ప్రాణాలను కాపాడుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే జమ్ముకశ్మీర్ లో ఈ ఏడాది వరదలు బీభత్సం సృష్టించాయి. వరదల కారణంగా గ్రామాలు సైతం తుడిచిపెట్టుకుపోయాయి. వరుస ప్రమాదాలకు చెట్లను నరికివేస్తూ కొండలపై రోడ్లు వేయడమే కారణమని, టూరిజం కోసం ప్రకృతిని నాశనం చేయవచ్చని సుప్రీంకోర్టు హెచ్చరించింది.