Crime news: మంత్రాలకు చింతకాయలు రాల్తాయి అనుకునే వాళ్ళది అమాయకత్వం అనుకోవాలో లేక మూర్కత్వం అనుకోవాలో తెలియదు. కానీ.. అలాంటి వాళ్ళు చేసే అకృత్యాలకు అమాయక ప్రజలు బలైపోతున్నారు. మనిషి అంతరిక్షం లోకి వెళ్తున్న ఈ రాకెట్ కాలంలో.. ఇంకా ఏదో అతీంద్రియ శక్తులు ఉన్నాయని.. వాటిని సాధిస్తే ఏదో లభిస్తుందని అనుకునే చాదస్తపు మనుషులు కూడా ఉన్నారు. గతంలో క్షుద్ర పూజలు చేసి కన్న బిడ్డలనే చంపుకున్న ఘటనలు మనం చూసాం. తాజాగా అలాంటి గంటనే ఒకటి ఆదిలాబాద్ లో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. తుకారం నగర్ కు చెందిన మెస్రం దేవుబాయి వయసు 48 సంవత్సరాలు. కాగా ఈమెను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసారు.
Read also:Papaya Seeds: బొప్పాయి గింజల్లో పుష్కలమైన విటమిన్స్.. బోలెడు ఉపయోగాలు కూడా..
అనంతరం గంగాపూర్ శివారులో ఉన్న ఓ పొలంలో మృతదేహాన్ని పడేసారు. కాగా చెత్తలో పడి ఉన్న మృత దేహాన్ని చూసిన స్థానికులు భయాందోళనలకు గురైయ్యారు. వేంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకోని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. క్షుద్ర పూజల్లో భాగంగా మహిళను హత్య చేసినట్టు అనుమానిస్తున్నారు పోలీసులు. కాగా హత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదు. ఈ నేపథ్యంలో పోలీసులు హత్యకు గల కారణాల నిమిత్తం విచారణ చేపట్టారు. ఈ విచారణలో భాగంగా డాగ్ స్క్వాడ్ బృందాలను రప్పించనున్నారు పోలీసులు.
