Hyderabad Crime: హైదరాబాద్ లో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. బాచుపల్లిలోని నారాయణ కళాశాలలో ఇంటర్ విద్యార్థిని అనూష హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నారాయణ కళాశాలలో అనూష ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. దసరా సెలవులకు వెళ్ళిన అనూషనీ తల్లిదండ్రులు ఈరోజు హాస్టల్లో వదిలేసి ఇంటికి బయలుదేరారు. తల్లితండ్రులు సిటీ దాటిలోపే అనూష స్పృహ కోల్పోయిందని కాలేజీ యాజమాన్యం సమాచారం ఇవ్వడంతో హుటా హుటిన తల్లిదండ్రులు కాలేజీ వద్దకు చేరుకున్నారు. కాలేజీకి వెళ్ళేసరికి అనూష ఊరి వేసుకొని చనిపోయిందని యాజమాన్యం తెలిపారు. షాక్ అయిన తల్లిదండ్రులు అనూషను చూడాలని తెలిపారు. అనూష మృత దేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించామని కాలేజీ యాజమాన్యం తెలుపడంతో కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనూష తల్లిదండ్రులు మాట్లాడుతూ.. ముందు అనూష స్పృహ కోల్పోయిందన్నారు.. కాలేజీ వద్దకు రాగానే ఆత్మహత్య చేసుకుంది అంటున్నారని వాపోయారు.
Read also: Group 1 Exams: నేడు గ్రూప్ -1 పరీక్షకు సర్వం సిద్ధం.. కేంద్రాల వద్ద భారీ బందోబస్తు..
అనూషను చూడాలని తెలుపగా.. కాలేజీలో లేదు మృత దేహాన్ని ఆసుపత్రికి తరలించామని అంటున్నారని కన్నీరుమున్నీరుగా విలపించారు. అనూష మృతికి నారాయణ కళాశాల యాజమాన్యం కారణమని అంటూ ఆందోళన చేశారు. ఇప్పటి వరకు అనూషను చూసేందుకు కూడా అనుమతించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనూషను ఇంటినుంచి తీసుకుని వచ్చినప్పుడు బాగానే ఉందని అన్నారు. ఇక్కడకు వచ్చిన గంటల్లోనే ఎందుకు ఆత్మహత్యకు పాల్పడుతుంది? అని ప్రశ్నించారు. కాలేజీ యాజమాన్యమే అనూష ఆత్మహత్యకు పాల్పడేలా చేశారని అనుమానం వ్యక్తం చేశారు. కూతురు(అనూష) ఆత్మహత్యకు కారకులు ఎవరో తెలిసేంత వరకు మృతదేహాన్ని కాలేజీ వద్దకు తీసుకుని వెళ్లి ఆందోళన చేస్తామని అన్నారు. అనూష నిజంగానే ఆత్మహత్య చేసుకుందా? లేదా కాలేజీలో ఏమైనా జరిగిందా అనేది అనూషను చూసేంత వరకు క్లారిటీ ఇచ్చేది లేదని తెలిపారు. దీంతో ఇటు నారాయణ కాలేజీ, అటు గాంధీ ఆసుపత్రి వద్ద అనూష కుటుంబ సభ్యులు చేరుకుని ఆందోళన చేస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే గాంధీ వద్దకు చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనూషది హత్యా, లేక ఆత్మహత్యనా? కాలేజీలో వెళ్ళిన అనూష గంటల వ్యవధిలోనే ఎందకు ఆత్మహత్య చేసుకుంది అనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాలేజీలోని యాజమాన్యం, అనూష స్నేహితులతో పోలీసులు చర్చిస్తున్నారు.
Telangana Ministers: నేడు దక్షిణ కొరియాలో తెలంగాణ మంత్రుల పర్యటన..