Indore: 8 ఏళ్లుగా తనతో శృంగారానికి నిరాకరిస్తుందనే కోపంతో ఒక వ్యక్తి తన భార్యను దారుణంగా హత్య చేశాడు. మధ్యప్రదేశ్ ఇండోర్‌లో ఈ ఘటన జరిగింది. నిందితుడిని సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. 40 ఏళ్ల మహిళ జనవరి 9న ఏరో డ్రోమ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరణించిందని డీసీపీ శ్రీకృష్ణ లాల్‌చందానీ మీడియాకు తెలిపారు. నిందితుడు ముందుగా ఆమె మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి, హై బీపీ కారణంగా ఇంట్లో తిరిగి పడిపోయి, మరణించినట్లు చెప్పాడని ఆయన తెలిపారు.
Read Also: Engineering Colleges: దేశంలో అత్యుత్తమ ఫ్యాకల్టీ, ప్లేస్‌మెంట్స్ తో.. టాప్ 30 BTech కాలేజీలు ఇవే
అయితే, పోస్టుమార్టం నివేదికలో గొంతునులిమి చంపడం ద్వారా మహిళ మరణించినట్లు తేలింది. విచారణతో తానే హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. మెకానిక్‌గా పనిచేసే వ్యక్తి, గత ఎనిమిదేళ్లుగా తన భార్య తనతో శృంగారానికి నిరాకరిస్తోందని, దీని వల్ల కోపంతో ఈ ఘటనకు పాల్పడినట్లు చెప్పాడు. నిందితుడిని ఆదివారం అరెస్ట్ చేశామని, ఈ కేసులో తదుపరి దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు.
