Nizamabad: పెళ్లికాక కొందరు బాధపడుతుంటే పెళ్లి చేసుకుని కొందరు బాధపెడుతున్నారు. నమ్మి వచ్చిన ఇల్లాలిని కట్నం కోసం వేధిస్తున్నారు. తప్పు అని చెప్పాల్సిన పెద్దలు.. కోడలి కన్నీళ్లు తుడవాల్సిన అత్తమామలు కనికరం లేకుండా కోడల్ని కాల్చుకు తిటున్నారు. తాను ఓ ఇంటి కోడలిని అనే విషయాన్ని మర్చిపోయి సోదరుని భార్యని హరిగోసల పాలుచేస్తున్నారు. భర్త, అత్తామామాలు, ఆడపడుచులు పెట్టె వేధింపులు భరించలేక కొందరు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఇంకొందరు భార్యని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో కోకొల్లలు. అయితే తాగాజా అలాంటి ఘటనే నిజమాబాద్ లో వెలుగు చూసింది.
Read also:Hyderabad: అలెర్ట్.. నగరంలో మంజీరా వాటర్ బంద్..
వివరాలలోకి వెళ్తే.. నిజామాబాద్ లోని ఎల్లమ్మ గుట్టలో అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుని మరణించింది. 9 సంవత్సరాల క్రితం నవిత అనే మహిళకి ఎల్లమ్మ గుట్టకు చెందిన వరుణ్ గౌడ్ తో వివాహం జరిగింది. వివాహమైన కొన్ని సంవత్సరాల తర్వాత అదనపు కట్నం తేవాలని భర్త వరుణ్ గౌడ్ వేధించాడు. దీనితో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఈ నేపథ్యంలో ఆమె తల్లిదండ్రులు భర్త, అత్తమామలు, ఆడపడుచు అదనపు కట్నం తేవాలని ఒత్తిడి చేశారని.. ఈ క్రమంలో తమ కూతురికి ఉరివేసి హత్య చేసి ఆ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాగా తమ కుమార్తెను హత్య చేసిన భర్త వరుణ్ గౌడ్ తో పాటు అత్త మామ, ఆడపడుచులపై కేసు నమోదు చేయాలని 4వ టౌన్ పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేశారు.