West Bengal: పశ్చిమ బెంగాల్ పోలీసులు భారీగా డ్రగ్స్ ను పట్టుకున్నారు. పోలీసులు పట్టుకున్న డ్రగ్స్ విలువ సుమారు రూ. 5 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. బెంగాల్ పోలీసులు బస్టాండ్ సమీపంలో 5 కోట్ల రూపాయలకు పైగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఇద్దరు నిందితుల్లో 35 ఏళ్ల గౌర్ సర్కార్ ఉండగా మరొకరు 60 ఏళ్ల గోలంగా గుర్తించారు. ఈరోజు వారిని బెర్హంపూర్‌లోని కోర్టు ముందు హాజరుపరచనున్నట్టు పోలీసులు తెలిపారు.
Read also: Dhanush: మరో సినిమా చేయడానికి రెడీ అయిన సూపర్బ్ కాంబినేషన్
రూ. 5 కోట్లకు పైగా విలువైన డ్రగ్స్‌తో ఉన్న ఇద్దరు వ్యక్తులను పశ్చిమ బెంగాల్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ అరెస్టు చేసింది. నిందితులు నిషిద్ధ వస్తువులు తీసుకెళ్తున్నట్లు ఇంటెలిజెన్స్ కు సమాచారం అందడంతో అధికారులు బెర్హంపూర్ బస్టాండ్ ప్రాంతంలో దాడి చేశారు. తదనుగుణంగా ఇద్దరినీ అరెస్టు చేసి, నార్కోటిక్ డ్రగ్స్ మరియు సైకోట్రోపిక్ పదార్ధాల చట్టంకు సంబంధించిన నిబంధనలతో అభియోగాలు మోపారు. ఇందులో డ్రగ్ కార్టెల్‌ను మరింత విచారించడానికి మరియు పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడం కోసం నిందితులను రిమాండ్‌కు పంపాలని పోలీసులు కోరనున్నారు. ఇద్దరు నిందితులను. వారి సామాన్లను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత వారి నుంచి మొత్తం 4 కిలోల 800 గ్రాముల నిషిద్ధ మార్ఫిన్ స్వాధీనం చేసుకున్నట్లు STF సూపరింటెండెంట్ ఇంద్రజిత్ బసు తెలిపారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై సమగ్ర విచారణను పోలీసులు పరిశీలిస్తున్నారు.
