Call Money Case: నూటికి పది రూపాయల వడ్డీ వసూళ్లు చేస్తారు. అది కూడా కొందరు వారం వడ్డీ, రోజు వడ్డీల ప్రకారం ఇస్తున్నారంటే ఆ దోపిడీ ఎలా ఉంటుందో అర్థమవుతుంది. పైగా అప్పు ఇచ్చేటప్పుడే వడ్డీ పట్టుకుని ఇస్తారు. ఆపై అసలు కోసం అంటూ వేధింపులు మొదలు పెడితే.. వారు తీర్చే లోపు లక్షలై కూర్చుంటుంది. ఇలా అప్పులు ఇచ్చేందుకు ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కొన్ని పట్టాణాల్లో కొన్ని గ్యాంగ్ లను పట్టుకున్నారు. వారి పని ఏమీ ఉండదు.. అప్పు తీసుకున్న వారి కోసం వేట సాగంచడమే. కనిపిస్తే చాలు ఉతికి ఆరేయడమే. సమయానికి డబ్బు కట్టలేదంటే ఎక్కడ కనిపిస్తే చావబాదడమే. ఇక పరువు గల కుటుంబాలైతే.. నేరుగా వారి ఇళ్ల వద్దకే వెళ్తారు. అందరూ చూస్తుండగానే వారిని బూతులు తిడుతారు. ఇళ్లలో సమాన్లను బయటకు పడేస్తారు.
Read Also: TVK Chief Vijay : స్టేజిపైనే కన్నీళ్లు పెట్టుకున్న టీవీకే చీఫ్ విజయ్
గత నెల 23 న ఎర్రగుంటకు చెందిన రాజాతోపాటు అతని అనుచరులు మొత్తం ఏడుగురు బాధితుడు రమణ ఇంటికి వచ్చి వడ్డీ చెల్లించాలని బెదిరించారు. ప్రస్తుతానికి ఉపాధి లేదని, త్వరలోనే చెల్లిస్తామని కాళ్లావేళ్లా పడి ప్రాధేయపడినా వారు కనికరించలేదు. రమణ, భారతి దంపతులను చుట్టుముట్టి ఇష్టానుసారం దాడి చేశారు. ‘కొట్టొద్దండి… చచ్చిపోతాం’ అంటూ ఎంతబతిమిలాడినా దయచూపలేదు. అమానుషంగా దాడి చేశారు. దెబ్బలు భరించలేక వారు అరుస్తూ కేకలు వేసినా చుట్టుపక్కల వారు సైతం వడ్డీ వ్యాపారులకు భయపడి వారించే యత్నం చేయలేదు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చిన వెంటనే ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Read Also: Anupama : పక్క స్టేట్లో ఇంత ఫేమస్ అవుతానని, ఇలాంటి ఒక లైఫ్ ఉంటుందని ఎప్పుడూ అనుకోలేదు!
ధర్మవరం పట్టణంలో అక్రమ వడ్డీ వ్యాపారం, హింసాత్మక వసూళ్ల కేసులో ప్రధాన నిందితుడు సాకే రాజశేఖర్, అలియాస్ ఏరికల రాజా.. అలియాస్ యర్రగుంట్ల రాజా ను పోలీసులు అరెస్టు చేశారు. అక్రమ వడ్డీ వ్యాపారం చేస్తూ, వడ్డీ చెల్లించని వారిని తన గుంపుతో కలిసి టెదిరించడం. దాడులు చేయించడం, బలవంతంగా డబ్బులు వసూలు చేయడం వంటి హింసాత్మక కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. చేనేత కుటుంబంపై దాడి చేసిన కేసులో రాజాతో పాటు అతని గ్యాంగ్ మొత్తాన్ని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. అక్రమ వడ్డీ వ్యాపారం, దాడులు, బెదిరింపులు, హింసాత్మక ఘటనలకి పాల్పడే వారి పైన కఠిన చర్యలు తీసుకొని. రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తామని ధర్మవరం డీఎస్పీ హేమంత్ కుమార్ తెలిపారు. నేర తీవ్రతను బట్టి PD act , జిల్లా బహిష్కరణ కూడా చట్ట పరంగా చేయడం జరుగుతుందని తెలిపారు.
