Hyderabadi Man Lost 4 Lakhs In Online Fraud: ఈమధ్య ఆన్‌లైన్ మోసాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఉద్యోగాల పేరుతోనో, పెట్టుబడుల ఆశ చూపించో.. జనాల నుండి లక్షలకు లక్షలు దోచేస్తున్నారు. ఇప్పుడు ఓ యువకుడు కూడా ఇలాగే కొందరు దుండగుల ట్రాప్‌లో పడి.. ఏకంగా రూ.4 లక్షలు పోగొట్టుకున్నాడు. అధిక లాభాలు వస్తాయన్న ఆశతో పెట్టుబడులు పెడితే, మోసగాళ్లు కుచ్చుటోపీ పెట్టారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
WPL 2023 : తొలి విజయాన్ని నమోదు చేసిన గుజరాత్ జట్టు
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీకి చెందిన ఓ యువకుడు ఎయిర్‌ఫోర్స్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఓరోజు ఆన్‌లైన్‌లో కాలక్షేపం చేస్తుండగా.. అతనికి ఓ ప్రకటన కనిపించింది. పెట్టుబడులు పెడితే.. భారీగా లాభాలు వస్తాయని ఆ యాడ్‌లో పేర్కొనబడి ఉంది. దీంతో.. అతడు ఆ యాడ్‌లో కనిపించిన వ్యక్తితో కాంటాక్ట్ అయ్యాడు. ఇంకేముంది.. తమ వలలో చేప చిక్కుకుందని అనుకొని, అతనికి మాయమాటలు చెప్పి, డబ్బులు దోచుకోవడం మొదలుపెట్టారు. యాప్స్‌లో పెట్టుబడి పెడితే.. భారీగా లాభాలు వస్తాయని దుండగులు నమ్మబలికారు. దీంతో.. వివిధ లింక్స్ ద్వారా విడతల వారీగా మూడు నెలల్లో రూ.4 లక్షలు యాప్‌లో పెట్టుబడులు పెట్టారు.
US Intelligence: పాకిస్తాన్ కవ్విస్తే అంతే.. మోదీ హయాంతో భారత్ సైనికంగా స్పందించే అవకాశం..
కట్ చేస్తే.. ఆ యువకుడికి ఎలాంటి లాభాలు రాలేదు. అలాగే, ఫలానా వ్యక్తి నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. దీంతో తాను మోసపోయానని భావించిన యువకుడు, కామారెడ్డి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. యాప్స్‌లో పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని నమ్మించి, సైబర్ చీటర్స్ తన వద్ద నుంచి రూ.4 లక్షలు దోచుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే.. ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందిగా అతడిని సూచించారు.