Site icon NTV Telugu

Lover Betrayed: ప్రేమన్నాడు.. కోరిక తీరాక పొమ్మన్నాడు.. కట్ చేస్తే..

Lover Betrayed Girl

Lover Betrayed Girl

Hyderabadi Guy Betrayed A Girl In The Name Of Love: ప్రేమ పేరుతో ఓ యువకుడు ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో, ఆ యువతి తన భర్తకు విడాకులిచ్చి, దేశాలు దాటి మరీ వచ్చింది. తీరా కోరిక తీరాక.. ఆ యువతిని వదిలి మరొకరితో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ యువతి.. అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. బోరబండ రాజ్‌నగర్‌ ప్రాంతానికి చెందిన ఓ యువతి (27) టెలీకాలర్‌గా పనిచేస్తుంది. ఈ యువతికి ఐదేళ్ల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో మహారాష్ట్ర జల్‌గావ్‌కు చెందిన సైఫ్‌(28)తో పరిచయం ఏర్పడింది. కొన్ని రోజుల తర్వాత అది ప్రేమగా మారింది. పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు హైదరాబాద్‌లో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని, సహజీవనం చేశారు. అయితే.. యువతి తరఫు కుటుంబసభ్యులు వారి పెళ్లికి నిరాకరించారు. అనంతరం 2020లో ఆమెకు మరొకరితో పెళ్లి చేసి, దుబాయ్‌కి పంపించారు.

Fire Accident: కూకట్‌పల్లిలో అగ్నిప్రమాదం.. మూడు బస్సుల్లో చెలరేగిన మంటలు..

పెళ్లి చేసుకొని దుబాయ్‌కి వెళ్లినా.. ఆ యువతి సైఫ్‌తో కాంటాక్ట్‌లోనే ఉంది. ఇద్దరు చాటింగ్‌లు, ఫోన్‌లు చేసుకోవడం కంటిన్యూ చేశారు. ఈ నేపథ్యంలోనే భర్తకు విడాకులిచ్చి తిరిగి రావాలని, తాను పెళ్లి చేసుకుంటానని సైఫ్ మాయమాటలతో మభ్యపెట్టాడు. పాపం.. అతని మాటలు నమ్మి, ఆ యువతి తన భర్తకు విడాకులిచ్చి, తిరిగి నగరానికి వచ్చింది. ఆమెకు గర్భస్రావం కూడా చేయించాడు. కొంతకాలం ఇద్దరు కలిసి ఉన్నారు. పెళ్లి ఎప్పుడు? అని ప్రశ్నించినప్పుడల్లా.. త్వరలోనే చేసుకుందామంటూ కాలం వెళ్లదీస్తూ వచ్చాడు. చివరికి ఒకరోజు అమ్మాయిని వదిలేసి.. సైఫ్ తన స్వగ్రామానికి వెళ్లిపోయాడు. తన ప్రేయసికి తెలియకుండా, మరో అమ్మాయితో ఈనెల 22న పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలు.. సైఫ్ స్వగ్రామానికి వెళ్లి నిలదీసింది. సైఫ్‌తోపాటు అతని కుటుంబసభ్యులు యువతిని అంగీకరించకపోవడంతో.. ఆమె హైదరాబాద్ తిరిగొచ్చి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Chicken Price: చికెన్ ధర ఆల్‌టైం రికార్డ్.. కేజీ రూ.720

Exit mobile version