సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు.. సోషల్ మీడియా వేదికగా తమ కన్నింగ్ ఐడియాలకు పదును పెడుతూ.. అందినకాడికి దండుకుంటున్నారు.. మొదట్లో మైకంలో ఉన్న సదరు వ్యక్తులు.. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు.. తీరా జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత లబోదిబోమంటున్నారు. తాజాగా మరో కొత్త ఫ్రాడ్ తెరపైకి వచ్చింది.. ఇన్స్టాగ్రామ్ లో ప్రేమ అంటూ ఓ మహిళకు వలస వేసిన సైబర్ టీచర్… రూ. 4 లక్షలు నొక్కేశాడు..
Read Also:SBI: అది ఫేక్.. స్పష్టం చేసిన ఎస్బీఐ..
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇన్స్టాగ్రామ్ లో హైదరాబాద్ కి చెందిన ఓ మహిళ తో పరిచయం చేసుకున్నారు సైబర్ చీటర్స్… ప్రేమ పాఠాలు చెబుతూ ఆమెకు మరింత దగ్గరయ్యాడు.. తమను పూర్తిగా నమ్మిందనే.. నమ్మకం కుదిరిన తర్వాత.. అసలు ప్లాన్ వర్కౌట్ చేశారు.. మిమ్మల్ని పిచ్చిగా ప్రేమిస్తున్నాను.. మిమ్మల్ని చూడడానికి విదేశాల నుండి వస్తున్ననని నమ్మించారు చీటర్స్… ఇక, ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో తనను పట్టుకున్నారని.. విడిపించాలని నాటకం మొదలు పెట్టారు.. నేను బయటకు రావాలంటే ఖర్చు అవుతుంది అంటూ దొంగ సాకులు చెప్పారు.. అలా 4 లక్షల రూపాయలు కాజేశారు చీటర్స్… అసలు పని ముగిసిన తర్వాత కాంటాక్ట్‌లో లేకుండా పోయాడు.. మోసపోయానని గుర్తించిన సదరు బాధితురాలు.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేశారు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.
