తెలిసీ తెలియని వయసు.. ఇరువురి మధ్య ఆకర్షణ.. అదే ప్రేమ అనుకుంటారు. చదువుపై చూపించాల్సిన శ్రద్ధ కాస్తా.. మరోవైపునకు దారి మళ్లుతుంది. అదే సమయంలో పెద్దలు మందలిచినా.. కాస్తా కన్నెర్ర చేసినా లేత మనసు గాయపడుతుంది. అది ఏ విపరీత పరిణామానికి దారి తీస్తుందో తెలియని పరిస్థితి. ఇలాంటి ఘటనలే హైదరాబాద్‌లో జరిగాయి. ఒకే స్కూలులో చదువుతున్న ఇద్దరు పదో తరగతి విద్యార్థులు ఉసురు తీసుకున్నారు. దీంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఇక్కడ ఈ ఫోటోలో చూస్తున్న బాలిక పేరు.. హన్సికా నాయక్. మియాపూర్‌లోని జనప్రియ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న బిజయ్‌నాయక్, చిన్మయినాయక్ కూతురు. మాధవ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్‌ల్లో టెన్త్ క్లాస్ చదువుతోంది. ఈ మధ్య స్కూల్‌లో పరీక్ష రాయడానికి వెళ్లిన హన్సికా నాయక్‌ను.. స్కూల్ మేనేజ్‌మెంట్ ఎగ్జామ్ రాయనీయలేదు. ఇంటికి వెళ్లిపోవాలని చెప్పారు. దీంతో మధ్యాహ్నం తిరిగి ఇంటికి వచ్చేసింది. అప్పటికే తీవ్ర మనస్థాపానికి గురైన హన్సికా.. తాము నివాసం ఉంటున్న జనప్రియా అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.. ఆ విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
READ MORE: Off The Record: ఆ ఎంపీకి నియోజకవర్గంలో చుక్కలు చూపిస్తున్నారా..? సొంత క్యాడరే నెత్తి బాదుకుంటుందా?
ఇక మాధవ్‌నగర్‌లోని హన్సిక చదువుతున్న స్కూల్‌ల్లోనే షేక్ రిజ్వాన్ కూడా పదో తరగతి చదువుతున్నాడు. అతడు జులై 19న స్కూల్ బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.. ఉన్నట్టుడి రిజ్వాన్ ఆత్మహత్య చేసుకోవడంపై కారణాలను విశ్లేషించుకున్నారు తల్లిదండ్రులు. ఐతే బలవన్మరణానికి పరోక్షంగా హన్సికానే కారణమని అతని కుటుంబసభ్యులు ఆరోపించారు. నిజానికి రిజ్వాన్, హన్సిక ఇద్దరు ఒకే క్లాస్ కావడంతో సన్నిహితంగా మెలిగేవారు. ఇద్దరు కలిసి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారు. ఇద్దరికి ఇన్‌స్ట్రాగ్రామ్‌లో అకౌంట్‌లు ఉన్నాయి. తరుచుగా మాట్లాడుకోవడానికి ఇన్‌స్టానే వేదికగా చేసుకున్నారు. ఒకరికొకరు మెసేజ్‌లు చేసుకునేవారు. రిజ్వాన్, హన్సిక మెసేజ్‌ల విషయం టీచర్ దృష్టికి వెళ్లింది. దీంతో ఆ టీచర్.. మెసేజ్‌ల విషయాన్ని ఇటీవల స్కూల్ ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్రిన్సిపాల్ రిజ్వాన్ తల్లిని పిలిపించి విషయాన్ని ఆమెకు వివరించారు. ఇంటికి వచ్చిన తరువాత తల్లిదండ్రులు కూడా మందలించడంతో… స్కూల్‌లోనూ, ఇంట్లోనూ మెసేజ్‌ల విషయం తెలిసిందన్న మనస్థాపంతో రిజ్వాన్ , స్కూల్ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు..
READ MORE: HCA Scam: కోట్లు కొల్లగొట్టడంలో ఆరితేరారు… హెచ్‌సీఏ జనరల్ సెక్రెటరీ దేవరాజ్ అరెస్ట్
రిజ్వాన్ ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయం తెలియడంతో హన్సిక తన తండ్రి బిజయ్ నాయక్‌ను తీసుకొని రిజ్వాన్ ఇంటికి వెళ్లింది. హన్సికను చూడగానే రిజ్వాన్ పేరెంట్స్ వారి పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కొడుకు ఎలా సూసైడ్ చేసుకున్నాడో నువ్వు కూడా అలాగే చనిపోవాలంటూ హన్సికను బెదిరించారు. రిజ్వాన్ పేరెంట్స్.. తన కూతురును బెదిరించిన వైనంపై ఆమె తండ్రి మియాపూర్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. అప్పటికే స్కూల్‌ల్లో ఎగ్జామ్ రాయనీయకపోవడం, మరోవైపు రిజ్వాన్ కుటుంబసభ్యులు బెదిరించడంతో తీవ్ర మనస్థాపానికి గురైన హన్సిక ఆత్మహత్య చేసుకుంది. తన కూతురు హన్సిక ఆత్మహత్య గల కారణాలను వివరిస్తూ ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు కుటుంబాలు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ పిల్లలను కోల్పోవడంతో తీవ్ర విషాదంలో ఉన్నాయి.
