NTV Telugu Site icon

Online Dating Fraud: వేశ్య కోసం వెతికాడు.. దోపిడీకి గురయ్యాడు

Online Dating Fraud

Online Dating Fraud

Hyderabad Techie Cheated By Online Fraudster In Dating Site: ‘ఈరోజు రాత్రికి అమ్మాయి కావాలా, ఎక్కువ డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు, ఒకట్రెండు వేలు పెడితే చాలు, ఒక రాత్రికి అందమైన అమ్మాయి మీ సొంతం’.. ఆన్‌లైన్‌లో ఇలాంటి ఊరించే యాడ్స్ కోకొల్లలు. ఇలాంటివి కంటపడినప్పుడు ఒంటరి అబ్బాయిలు, అది కూడా యుక్త వయసులో ఉన్నవారు ఊరికే ఉంటారా? వెంటనే ఆ లింక్ మీద క్లిక్‌మనిపిస్తారు. ఇలా క్లిక్ చేసిన యువకులెందరో అడ్డంగా బుక్కయ్యారు. సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి, లక్షలకు లక్షలు పోగొట్టుకున్నారు. ఇప్పుడు హైదరాబాద్‌కి చెందిన మరో టెక్కీ కూడా ఇలాగే దోపిడీకి గురయ్యాడు. వేశ్య కోసం ఆన్‌లైన్‌లో వెతికి.. సుమారు రూ. 2 లక్షల వరకు కోల్పోయాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..

Uttarpradesh: ఢిల్లీ తరహాలో మరో ఘటన.. మహిళను ఢీకొట్టి 3 కి.మీ ఈడ్చుకెళ్లిన ట్రక్కు..

హైదరాబాద్‌లోని చందానగర్‌లో ఒక ఐటీ ఉద్యోగి నివాసం ఉంటున్నాడు. డిసెంబర్ చివరి వారంలో ఇతడు ఆన్‌లైన్‌లో కార్ల్‌గర్ల్ కోసం వెతికాడు. ఈ క్రమంలో ఒక వెబ్‌సైట్ కనిపించడంతో, లింక్ క్లిక్ చేశాడు. అప్పుడు అతనికి ఒక వాట్సాప్ నంబర్ దొరికింది. వెంటనే ఆ నంబర్‌కు మెసేజ్ చేశాడు. అవతలి నుంచి ఒక వ్యక్తి పటేల్ చార్మి పేరుతో పరిచయం చేసుకున్నాడు. తన వద్ద ఎంతోమంది కాల్‌గర్ల్స్ ఉన్నారని, తక్కువ ధరకే సర్వీసులు అందిస్తామని నమ్మించాడు. కొందరు అమ్మాయిల ఫోటోలు కూడా పంపించాడు. అది చూసి ఆ టెక్కీ టెంప్ట్ అయిపోయాడు. ఇంకేముంది.. తన వలలో చేప చిక్కిందనుకొని, అవతలి వ్యక్తి డబ్బులు గుంజడం మొదలుపెట్టాడు. మొదట్లో బుకింగ్ కోసం రూ. 510 అడిగాడు. ఆ తర్వాత ఒక రాత్రికి అమ్మాయి కావాలంటే రూ. 5,500 కట్టమన్నాడు. అనంతరం సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ. 7,800 కట్టాలని కోరాడు. సర్వీస్ అయిపోయాక ఆ డబ్బులు తిరిగిస్తామని నమ్మబలకడంతో.. ఆ టెక్కీ డబ్బులు ఇచ్చేశాడు.

Gun Fire: ఇంటి ముందు మూత్రం పోయొద్దన్నందుకు తుపాకీతో కాల్పులు

ఇలా వేర్వేరు కారణాలు చెప్తూ.. ఆ టెక్కీ నుంచి నిందితుడు ఏకంగా రూ. 1.97 లక్షలు కాజేశాడు. ఇంకాసేపట్లోనే అమ్మాయిని పంపిస్తానని చెప్పాడు. అంతే, ఆ తర్వాతి నుంచి అతడు పత్తా లేకుండా పోయాడు. వాట్సాప్‌లో బ్లాక్ చేశాడు, ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో తాను మోసపోయానని గ్రహించిన ఆ టెక్కీ.. తనకు న్యాయం చేయమని సైబర్‌క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించారు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టారు.

Bangalore Airport: తనిఖీ పేరుతో దుస్తులు విప్పించారు.. కట్ చేస్తే ఊహించని ట్విస్ట్