Site icon NTV Telugu

Hyderabad Crime : హైదరాబాద్‌లో రెచ్చిపోతున్న పోకిరీలు

Hyd Crime

Hyd Crime

Hyderabad Crime : హైదరాబాద్‌లో పోకిరీల హాంగామాకు హద్దూ అదుపూ లేకుండా పోయింది. అర్థరాత్రి రోడ్ల మీద నానా హంగామా చేస్తూ జనజీవనానికి ఆటంకం కలిగిస్తున్నారు. మద్యం, గంజాయి మత్తులో జోగుతూ.. నడి రోడ్డుపై కత్తులు పట్టుకుని తిరుగుతున్నారు. ఇలా నానా న్యూసెన్స్ చేస్తున్న పోకిరీల ఆట కట్టించాలని సిటీ జనం కోరుతున్నారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఆసిఫ్‌నగర్‌లో జరిగింది. ఆసిఫ్‌నగర్‌లో ఉంటున్న ముజఫర్ అనే యువకుడు తన బర్త్ డే పార్టీ కోసం మిత్రులను ఆహ్వానించాడు. అర్ధరాత్రి రోడ్డుపై డీజే పెట్టి హంగామా చేశాడు. అంతే కాదు కత్తులు, తల్వార్లతో డాన్సులు చేస్తూ హంగామా సృష్టించారు. వీళ్ల డాన్స్ వీడియోలను ఎవరో స్థానికులు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇది వైరల్‌గా మారింది. దీంతో ఈ వీడియోలపై దృష్టిసారించిన పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు..

Hyderabad: నగరం నడిబొడ్డులో పట్ట పగలే హత్య.. కత్తులతో దారుణంగా నరికి…

మరోవైపు ఈ బర్త్ డే పార్టీ వల్ల తాము ఇబ్బంది పడ్డామని కొంత మంది స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ముజఫర్ బర్త్ డే పార్టీగా గుర్తించారు. అంతే కాదు బర్త్ డే పార్టీలో పాల్గొని హంగామా చేసిన యువకుల వివరాలు సేకరించారు. అందరిపైనా పబ్లిక్ న్యూసెన్స్, సౌండ్ పొల్యూషన్, ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.. ప్రజలకు ఇబ్బంది కలిగించే వారు ఎవరినైనా ఉపేక్షించేది లేదని పోలీసులు చెబుతున్నారు. ఎవరి వల్లనైనా ఇబ్బంది కలిగితే తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరుతున్నారు. పబ్లిక్ న్యూసెన్స్ చేసినా.. అర్థరాత్రి రోడ్లపై హంగామా చేసినా తాట తీస్తామని వార్నింగ్ ఇస్తున్నారు.

Hyderabad: పూటకోవేశం.. జనాలను చీట్ చేస్తూ కోట్ల రూపాయలు కొల్లగొట్టాడు..

Exit mobile version