Site icon NTV Telugu

Rave Party : హైదరాబాద్ శివారులో మరో రేవ్ పార్టీ కలకలం

Rave Party

Rave Party

Rave Party : హైదరాబాద్‌ నగర శివారులో మళ్లీ రేవ్ పార్టీ కలకలం రేగింది. మాదకద్రవ్యాలు, మద్యం, క్యాసినో కాయిన్స్‌తో సాగే ఈ రాత్రి పార్టీలకు మరోసారి తెరలేపిన ఘటన ఇది. రాచకొండ పరిధిలోని మహేశ్వరం మండలం చెర్రాపల్లి సమీపంలోని కె. చంద్రారెడ్డి రిసార్ట్స్‌లో ఈ రేవ్ పార్టీ జరిగింది. విశ్వసనీయ సమాచారం ఆధారంగా SOT పోలీసులు రాత్రి ఆలస్యంగా దాడులు నిర్వహించి, రిసార్ట్స్‌లో జరిగిన అశ్లీల విందును అడ్డుకున్నారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఈ పార్టీని గుంటూరుకు చెందిన ఫర్టిలైజర్ కంపెనీ డీలర్ ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు. తన కంపెనీకి చెందిన ఇతర డీలర్లను, వ్యాపార భాగస్వాములను కలిపి “బిజినెస్ గ్యాదరింగ్” పేరుతో ఈ రేవ్ పార్టీని నిర్వహించినట్లు తెలుస్తోంది. రాత్రంతా సాగిన ఈ పార్టీలో ఏడుగురు మహిళా డాన్సర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారని పోలీసులు తెలిపారు. ఈ మహిళలు హైదరాబాద్‌, బెంగళూరుకు చెందినవారని సమాచారం. వారితో పాటు పలువురు వ్యాపారవేత్తలు, యువకులు కూడా పార్టీలో పాల్గొన్నారు.

Group 2 : గ్రూప్-2 అభ్యర్థులకు శుభవార్త.. శిల్పకళావేదికలో నియామక పత్రాల కార్యక్రమం

దాడుల సందర్భంగా పోలీసులు పెద్ద మొత్తంలో మద్యం సీసాలు, క్యాసినో కాయిన్స్, సౌండ్ సిస్టమ్, పార్టీ లైటింగ్ సామగ్రిలను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు.. పార్టీలో పాల్గొన్న వారిని విచారణ నిమిత్తం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్టీ నిర్వాహకుడు అయిన ఫర్టిలైజర్ డీలర్‌ను కూడా పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనపై సంబంధిత ఎక్సైజ్‌, మాదకద్రవ్య నియంత్రణ విభాగాలు కూడా సమాచారం సేకరిస్తున్నాయి.

ఇటీవలి కాలంలో హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో రేవ్ పార్టీలు విస్తృతంగా పెరుగుతున్నాయి. ప్రత్యేకించి శివారు ప్రాంతాల్లోని రిసార్ట్స్‌, ఫార్మ్ హౌస్‌లను ఈ తరహా పార్టీలకు వేదికగా వాడుకుంటున్నారు. పోలీసులు ఇలాంటి కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

KTR : ఈ ఫేక్ ఓటర్లలో మైనర్లు కూడా.. కీలక విషయాలు వెల్లడించిన కేటీఆర్‌

Exit mobile version