NTV Telugu Site icon

Crime: ప్రియురాలిని దూరం చేసిన తండ్రి.. గన్‌తో కాల్చిన ప్రియుడు

Hyderabad

Hyderabad

ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది. అంతేకాని చావును కాదు. ప్రేమ ప్రదర్శింపబడుతుంది. అది ఏ రూపంలోనైనా?. అంతేతప్ప.. ఏ విధంగాను మరణాన్ని కోరుకోదు. అయితే ప్రియురాలిని తన నుంచి దూరం చేశారన్న కోపంతో ఓ ప్రియుడు మూర్ఖంగా ప్రవర్తించాడు. ఏకంగా ప్రియురాలి తండ్రిపై తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో అమ్మాయి తండ్రి కన్ను కోల్పోయాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో చోటుచేసుకుంది.

ఇది కూడా చదవండి: Hyderabad: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కోసం నోడల్ ఆఫీసర్ల నియామకం..

సరూర్‌నగర్‌ వెంకటేశ్వర కాలనీ రోడ్డు నెంబర్‌ 14లోని మల్లికారాణి అపార్ట్‌మెంట్‌లో పెరిశెట్టి రేణుక ఆనంద్‌ (57) నివాసం ఉంటున్నారు. ఇతనికి ఇద్దరు సంతానం. చిన్న కుమార్తె పాఠశాలల్లో చదివే సమయంలో తన క్లాస్‌మేట్‌ ఆయన బల్వీందర్ సింగ్(25)తో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి బల్వీందర్ ఆమెను ప్రేమిస్తున్నానని వెంటపడుతూ తిరుగుతున్నాడు. యువతి దుండిగల్‌లోని ఓ ఇంజనీరింగ్‌ చదువుతుంటే.. అతడు కూడా అక్కడే జాయిన్ అయ్యాడు. అబ్బాయి వెంటపడుతున్నట్లు అమ్మాయి తండ్రి గమనించి… కుమార్తెను అమెరికాకు పంపేశాడు. అయితే ప్రియుడు బల్వీందర్.. ఆరు నెలల క్రితం అమ్మాయి తండ్రి ఆనంద్‌ ఇంటికి వచ్చి చంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో ఆనంద్.. బల్వీందర్ తల్లిదండ్రులను పిలిపించి వారి సమక్షలో కౌన్సెలింగ్ ఇప్పించాడు. కానీ అతనిలో మార్పు రాలేదు. ఇక ప్రియురాలు అమెరికా వెళ్లిపోవడంతో పగ మరింత రెట్టింపు అయింది.

ఇది కూడా చదవండి: Andhra Pradesh: స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్-2047 టాస్క్ ఫోర్స్ కమిటీ తొలి భేటీ.. 15 శాతం వృద్ధి రేటు టార్గెట్..

పథకం ప్రకారం ఆనంద్‌ను చంపేయాలని బల్వీందర్ ప్లాన్ చేసుకుని ఆదివారం అమ్మాయి ఇంటికి వచ్చాడు. షూటింగ్‌ ప్రాక్టీస్‌ కోసం తెచ్చుకొన్న ఎయిర్‌గన్, షార్ట్‌ గన్‌తో ఆనంద్‌ ఇంటికి వచ్చి గొడవ పడి కాల్పులు జరిపాడు. బుల్లెట్‌ ఆనంద్‌ కుడి కన్నుపై తగిలి తీవ్ర గాయమైంది. వెంటనే అక్కడ నుంచి వెళ్లిపోయిన బల్వీందర్.. పక్కనే ఉన్న అంబితా శ్రీనిలయం అపార్ట్‌మెంట్‌లో ఉన్న ఆనంద్‌ కారును ధ్వంసం చేసి బైక్‌పై పారిపోయాడు. గాయపడిన ఆనంద్‌ను స్థానికులు ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి బల్వీందర్‌ను అరెస్టు చేసినట్లు సరూర్‌నగర్‌ సీఐ సైదిరెడ్డి తెలిపారు. సెక్షన్ 109 (హత్య ప్రయత్నం), BNS మరియు ఆయుధాల చట్టంలోని సంబంధిత నిబంధనల ప్రకారం అతనిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి ఎయిర్‌గన్, షార్ట్‌గన్‌ , బైక్, సెల్‌ఫోన్‌ స్వాదీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Mandira : ఫ్యాన్స్ కోసం సన్నీ లియోన్ వచ్చేస్తోంది..

 

Show comments