Site icon NTV Telugu

Hyderabad Murder : ఫాస్ట్ ఫుడ్ సెంటర్ యజమాని దారుణ హత్య.. మరొకరికి గాయాలు..

Murder

Murder

Hyderabad Murder : హైదరాబాద్ (Hyderabad) లోని షాహలీబండ వద్ద మంగళవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు దాడి చేయడంతో ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ యజమాని మృతి చెందగా, అతనితో పాటు ఉన్న మరో వ్యక్తి గాయపడ్డాడు. ఇక మృతుడును రఫీక్ బిన్ షిమ్లాన్ గా గుర్తించగా., అతని స్నేహితుడిని ఖలీద్‌ లుగా గుర్తించారు. వీరు షహలీబండ వద్ద రహదారి పై వెళుతుండగా, కొంతమంది వ్యక్తులు కత్తులతో దాడి చేశారు.

BCCI-Gautam Gambhir: ఇంటర్వ్యూకు హాజరైన గౌతమ్‌ గంభీర్‌.. ఓ రౌండ్‌ ముగిసింది!

తీవ్ర గాయాలపాలైన రఫీక్‌ అక్కడికక్కడే మృతి చెందగా., అతని స్నేహితుడు ఖలీద్‌ కూడా గాయపడి ఆస్పత్రికి తరలించారు. రఫీక్‌ ను హత్య చేసిన అనంతరం దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. షాహలిబండ పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. కొంతమంది ప్రత్యక్ష సాక్షులను కూడా పోలీసులు విచారించారు. దాడి వెనుక కారణాలపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

Haris Rauf Fan: నన్ను ట్రోల్ చేస్తే భర్తిస్తా.. నా కుటుంబం జోలికి వస్తే వదిలిపెట్టను!

Exit mobile version