Site icon NTV Telugu

Hyderabad: వీకెండ్‌ వచ్చిందంటే చాలు… హైదరాబాద్‌ శివారు బాట పడుతున్న యువత..!

Hyderabad

Hyderabad

Hyderabad: హైదరాబాద్ సిటీలో నిఘా ఎక్కువైందని.. శివారు ప్రాంతాలను అడ్డాలుగా చేసుకున్నారు. డ్రగ్‌ పార్టీల కోసం ఫాం హౌజ్‌లు, రిసార్ట్‌లు అద్దెకు తీసుకుంటున్నారు. బర్త్‌ డే.. గెట్‌ టుగెదర్‌.. వీకెండ్‌ ఔటింగ్‌… అంటూ పార్టీల పేరుతో డ్రగ్స్‌ తీసుకుంటూ ఎంజాయ్‌ చేస్తున్నారు. తాజాగా 10 రోజుల వ్యవధిలోనే 2 డ్రగ్‌ పార్టీలపై దాడులు చేశారు పోలీసులు. యువకుల వద్ద పెద్ద ఎత్తున్న డ్రగ్స్‌, గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు గబ్బు పట్టిస్తున్న పబ్బులపైనే ఫోకస్‌ పెట్టిన పోలీసులు.. ఇప్పుడు నగర శివారులపైనా దృష్టిపెట్టారు. వీకెండ్‌ వచ్చిందంటే చాలు… హైదరాబాద్‌లో శివారు బాట పడుతున్నారు కొందరు యువకులు. ఎంజాయ్‌మెంట్‌ పేరుతో ఫామ్‌ హౌజ్‌లు, రిసార్ట్‌లకు వెళ్తున్నారు. ఫ్రెండ్స్‌తో కలిసి లిక్కర్‌ పార్టీ చేసుకునేది కొందరైతే… కేవలం డ్రగ్‌ పార్టీలు చేసుకునేందుకు వెళ్తున్న వాళ్లు మరికొందరు. నగరంలో గంజాయి, డ్రగ్స్‌ను వెంటాడుతున్నాయి ఈగల్‌ టీమ్స్‌. అడుగడుగునా గంజాయి, డ్రగ్స్‌ సరఫరాకు చెక్‌ పెడుతున్నారు. దొరికితే తాట తీస్తున్నారు. దీంతో… మత్తురాయుళ్లు సిటీ శివారులను అడ్డాలుగా మార్చుకుంటున్నారు..

READ MORE: Newly Married Women’s Suicides: వధువులకు నరక ప్రాయంగా మారుతున్న పెళ్లిళ్లు..!

తాజాగా చేవెళ్ల పరిధిలో ఉన్న ఓ ఫామ్‌ హౌజ్‌లో కొందరు యువకులు… డ్రగ్‌ పార్టీ నిర్వహిస్తుండగా పట్టుకున్నారు ఎక్సైజ్‌ పోలీసులు. పెద్ద ఎత్తున్న డ్రగ్స్‌, హాష్‌ ఆయిల్‌ స్వాధీనం చేసుకున్నారు. వీకెండ్‌.. దీనికి తోడు.. ఫ్రెండ్‌ షిప్‌ డే… ఓ యువకుడి బర్త్‌ డే… అన్నీ కలిసొచ్చాయని ఫామ్‌ హౌజ్‌ను బుక్‌ చేసుకుని డ్రగ్‌ పార్టీ చేసుకున్నారు యువకులు. హైదరాబాద్‌‌కి చెందిన యువకులు అభిజిత్‌ బెనర్జీ, సింప్సన్‌, పార్థు, గోయల్‌, యశ్వంత్‌ రెడ్డి, సెవియో డెన్నిస్‌ స్నేహితులు. వీళ్లంతా వేర్వేరు కంపెనీల్లో ఐటీ ఉద్యోగులుగా పని చేస్తున్నారు. రెండు రోజుల క్రితం అభిజిత్‌ రెడ్డి పుట్టిన రోజు కావడంతో స్నేహితులంతా పార్టీ అడిగారు. ఎలాగో ఫ్రెండ్‌ షిప్‌ డే కూడా ఉండటంతో వీకెండ్‌లో కలుద్దామని ఫిక్స్‌ అయ్యారు. మొయినాబాద్‌ మండలం మేడిపల్లిలోని సెరీన్‌ ఆర్చర్డ్స్‌ ఫామ్‌ హౌజ్‌ను బుక్‌ చేసుకున్నారు. బర్త్‌ డే పార్టీని కాస్తా… డ్రగ్‌ పార్టీగా మార్చారు. LSD బ్లాస్ట్స్‌, హాష్‌ ఆయిల్‌ తోపాటు పెద్ద ఎత్తున లిక్కర్‌ తీసుకెళ్లారు. స్నేహితులంతా కలిసి డ్రగ్‌ పార్టీ చేసుకున్నారు. పక్కా సమాచారం అందుకున్న ఎక్సైజ్‌ పోలీసులు… ఫామ్‌ హౌజ్‌ పై రైడ్‌ చేశారు. డ్రగ్స్‌, హాష్‌ ఆయిల్‌, లిక్కర్‌ స్వాధీనం చేసుకున్నారు. యువకులను అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్‌ టెస్టులు చేయగా.. యువకులకు పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఎన్‌డీపీఎస్‌ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేశారు. ఫామ్‌ హౌజ్‌ నిర్వాహకుడిపై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు..

Exit mobile version