Hyderabad Fake Snacks Raid: పిల్లలు తినే స్నాక్సేనా ఇవి.? కాటేదాన్‌లో 55 టన్నులు సీజ్.!
- కాటేదాన్‌లో సాహిల్ ఫుడ్స్ యూనిట్లపై టీజీ సేఫ్ దాడులు
- నిబంధనల ఉల్లంఘనతో నాలుగు యూనిట్ల లైసెన్సులు సస్పెండ్
- 55 టన్నుల ఆహార పదార్థాలు.. రూ.33.94 లక్షల సరుకు సీజ్
- పరీక్షల కోసం 11 నమూనాలు ప్రభుత్వ ల్యాబ్‌కు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్నాక్స్ కాదు… అవి విషంతో సమానం.. ఆ స్నాక్స్ తింటే మన పిల్లల ఆరోగ్యం గోవిందా.. చౌకగా వస్తున్నాయని చెప్పి స్థానికంగా తయారీ అయిన స్నాక్స్ కొని తింటే అంతే సంగతులు.. బ్రాండెడ్ కంపెనీల పేరు తోటి స్నాక్స్ తయారు చేసి మార్కెట్ లో విక్రయిస్తున్న ముఠా ను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు.. హైదరాబాద్ కేంద్రంగా తయారవుతున్న నకిలీ స్నాక్స్ ఫ్యాక్టరీ పైన అధికారులు దాడులు చేసి ఏకంగా నాలుగు యూనిట్లను వెంటనే సీజ్ చేశారు.. అంతేకాకుండా నకిలీ స్నాక్స్ తయారు చేస్తున్న కంపెనీని అధికారులు మూసివేశారు..
కాటేదాన్‌లో ‘సాహిల్ ఫుడ్స్’ యూనిట్లపై టీజీ సేఫ్ కొరడా దాడి చేసి 55 టన్నుల ఆహార పదార్థాలు సీజ్ చేశారు.. సోహిల్ ఫుడ్ కు చెందిన 4 యూనిట్ల లైసెన్సులు రద్దు చేస్తున్న రుచికరమైన చిరుతిళ్ల పేరుతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ కేటుగాళ్ల గుట్టు రట్టయింది. హైదరాబాద్ కాటేదాన్ సమీపంలోని ప్రేమావతి పేట వేదికగా నిబంధనలను తుంగలో తొక్కి సాగుతున్న భారీ స్నాక్స్ తయారీ దందాపై తెలంగాణ ఫుడ్ సేఫ్టీ (టీజీ సేఫ్) అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ప్రముఖ స్నాక్స్ బ్రాండ్ ‘సాహిల్ ఫుడ్స్’కు చెందిన ఐదు తయారీ కేంద్రాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టి, ఆహార భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలను బట్టబయలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న నాలుగు యూనిట్ల ఎఫ్ఎస్ఎస్ఏఐ (FSSAI) లైసెన్సులు, రిజిస్ట్రేషన్లను తక్షణమే సస్పెండ్ చేసి, ఉత్పత్తి కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాల్సిందిగా ఆదేశించారు.
Also Read
- Fake Number Plates: నకిలీ నంబర్ ప్లేట్లకు చెక్.. 100 వాహనాలు సీజ్.!
- Tiger Shroff Shooting: టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. దీపావళి టపాసులు అనుకున్నాం..!
- Bengaluru Lawyer Murder: దారుణం.. అద్దె డబ్బుల వివాదంతో లాయర్ హత్య! కాల్పులు జరిపి పరారైన ఇద్దరు అద్దెదారులు
- UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
అపరిశుభ్రతకు పరాకాష్ట.. గుట్కా నములుతూనే తయారీ . స్నాక్స్ తయారీ చేస్తున తీరు ఇది..తనిఖీల్లో వెలుగుచూసిన దృశ్యాలు అధికారులను విస్మయానికి గురిచేశాయి. తయారీ కేంద్రాల్లో తీవ్రమైన అపరిశుభ్రత రాజ్యమేలుతోంది. ఆహార వ్యర్థాలు ఎక్కడికక్కడ పేరుకుపోయి ఉండగా, యంత్రాల నిర్వహణను పూర్తిగా గాలికొదిలేశారు. కనీస వెంటిలేషన్ లేని ఇరుకు గదుల్లో ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఆహార పదార్థాలను తయారుచేసే సిబ్బంది గుట్కా, పాన్ మసాలాలు నములుతూ విధులు నిర్వహిస్తుండటం కనిపించింది.
తినుబండారాలను నేరుగా నేలపైనే గుట్టలుగా పోసి నిల్వ ఉంచారు. ప్రమాదకరమైన సింథటిక్ ఫుడ్ కలర్లను అపరిశుభ్ర బకెట్లలో నిల్వ చేసి వాడుతున్నారు. ఉత్పత్తుల తయారీ, విక్రయ రికార్డులను సక్రమంగా నిర్వహించకపోవడమే కాకుండా, లైసెన్సుల్లో అనుమతి లేని ఆహార పదార్థాలను కూడా అక్రమంగా తయారు చేస్తున్నట్లు నిర్ధారణ అయింది.
రూ.34 లక్షల సరుకు సీజ్.. ల్యాబ్‌కు 11 నమూనాలు ఈ దాడుల్లో ఎలాంటి లేబుల్స్, తయారీ వివరాలు లేని సుమారు 55 టన్నుల ఆహార పదార్థాలను అధికారులు జప్తు చేశారు. వీటి బహిరంగ మార్కెట్ విలువ దాదాపు రూ.33.94 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఆహార నాణ్యత అత్యంత అధ్వానంగా ఉండటంతో మొత్తం 11 శాంపిల్స్ సేకరించి, సమగ్ర విశ్లేషణ కోసం ప్రభుత్వ ల్యాబ్‌కు పంపించారు. నివేదిక రాగానే బాధ్యులపై కఠిన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్యాకెట్‌పై తప్పనిసరిగా FSSAI లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్ ఉందో లేదో చూడాలి. ఉత్పత్తి పేరు, తయారీదారు పూర్తి చిరునామా, బ్యాచ్ నంబర్, తయారీ, గడువు ముగిసే తేదీ (Expiry Date) స్పష్టంగా ఉన్నాయో లేదో సరిచూసుకోవాలి. నిల్వ సూచనలు (Storage instructions) లేనివి, ప్యాకింగ్ చిరిగిపోయిన లేదా లూజ్ ప్యాక్‌లను ఎట్టిపరిస్థితుల్లో కొనవద్దు. సరైన లేబుల్స్ లేని, అస్పష్ట సమాచారంతో విక్రయించే చిరుతిళ్లకు దూరంగా ఉండాలి. కాటేదాన్ కేంద్రంగా నడుస్తున్న నకిలీ ఫ్యాక్టరీల పైన అధికారులు దృష్టి సారించారు అంతేకాకుండా ఇక్కడ తయారైతే తనిఖీలు చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు..
తాజావార్తలు
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
-
CM Chandrababu : రీల్స్ నుంచి బయటకు రండి.. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
IND-W vs ZIM-W: హర్మన్‌ప్రీత్ విధ్వంసం.. జింబాబ్వే ముందు భారీ టార్గెట్.!
-
PM Modi: ‘దేశమే ప్రథమం’.. దేశ శత్రువులను గుర్తించి ఓడించాలి.. విజయదశమి వేళ ప్రధాని మోదీ పిలుపు.!
ట్రెండింగ్
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!