Fake Notes : మెహదీపట్నం పోలీసులు, కమిషనర్ టాస్క్ ఫోర్స్ సౌత్ వెస్ట్ జోన్ బృందం సంయుక్తంగా భారీ ఆపరేషన్ నిర్వహించి నకిలీ కరెన్సీ తయారీ గ్యాంగ్‌ను పట్టుకున్నారు. ఈద్గా గ్రౌండ్స్, ఫస్ట్ లాన్సర్ వద్ద దాడి చేసి మొత్తం 8 మంది నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ₹4.75 లక్షల నకిలీ ₹500 నోట్లను, నాలుగు ద్విచక్ర వాహనాలు, ఒక కారు, తొమ్మిది మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు కస్తూరి రమేష్ బాబు తాండూర్‌లో తన సోదరితో కలిసి స్కానర్, ల్యాప్‌టాప్, ఫోటోషాప్ సాఫ్ట్‌వేర్ సహాయంతో నకిలీ నోట్లను తయారు చేస్తున్నట్లు విచారణలో తేలింది.
Omar Abdullah: ప్రతి కాశ్మీరీ ఉగ్రవాది కాదు.. ఢిల్లీ పేలుళ్లపై స్పందించిన సీఎం ఒమర్ అబ్దుల్లా
నకిలీ నోట్లను అసలు నోట్ల 1:4 నిష్పత్తిలో మార్కెట్లో చలామణి చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. రమేష్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కస్టమర్లను సంప్రదించి నకిలీ నోట్లను విక్రయించేవాడు. అతని ద్వారా వహీద్, తహా, సోహైల్, ఫహాద్, ఇమ్రాన్, ఒమర్, అల్తమాష్ తదితరులు చైన్ సిస్టమ్‌లో నకిలీ నోట్లను విస్తరించారు. ఈ ఆపరేషన్‌ను డీసీపీ సౌత్ వెస్ట్ జోన్ జి. చంద్రమోహన్ పర్యవేక్షణలో, అదనపు డీసీపీ ఇక్బాల్ సిద్ధిఖీ, ఏసీపీ బి. కిషన్‌కుమార్, ఇన్స్పెక్టర్లు జి. సంతోష్ కుమార్, మల్లేష్, ఎన్. రాంబాబు, ఎస్ఐ ప్రీతి రెడ్డి నేతృత్వంలో నిర్వహించారు. నిందితులను 12 నవంబర్ ఉదయం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.
Vijay Devarakonda : వీలైనంత ఎంజాయ్ చేయండి.. విజయ్ కామెంట్స్ కు అర్థమేంటో
