Site icon NTV Telugu

Cyber Crime : సైబర్ ముఠా రహస్యాలు వెలుగులోకి.. బిగ్‌ ఆపరేషన్‌..!

Cyber Crime

Cyber Crime

Cyber Crime : సైబర్‌ నేరగాళ్లపై హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు బిగ్‌ ఆపరేషన్‌ చేపట్టారు. నగరంలో పెరుగుతున్న సైబర్‌ మోసాలను అరికట్టేందుకు పోలీసులు దాదాపు నెలరోజుల పాటు ప్రత్యేక దర్యాప్తు, ఆపరేషన్‌ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా అక్టోబర్‌ నెలలో మొత్తం 196 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి, దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు చెందిన 55 మంది నిందితులను అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

Kurnool Bus Incident: వి.కావేరి ట్రావెల్స్ యజమాని వేమూరి వినోద్ కుమార్ అరెస్ట్..!

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెలలోనే సైబర్‌ మోసగాళ్ల వివిధ బ్యాంక్‌ ఖాతాల్లో రూ.107 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. దర్యాప్తులో భాగంగా బ్లాక్‌ చేయించిన ఖాతాలు, ఫ్రీజ్‌ చేసిన లావాదేవీల ద్వారా ఇప్పటి వరకు బాధితులకు రూ.62.34 లక్షలు తిరిగి చెల్లించినట్లు తెలిపారు. సైబర్‌ మోసాలు ఏ రకంగా జరుగుతున్నాయో పోలీసులు వివరించారు. వీటిలో ప్రధానంగా ఇన్వెస్ట్‌మెంట్‌ స్కామ్‌లు, ఫేక్‌ ట్రేడింగ్‌ యాప్‌లు, సోషల్‌ మీడియా ఫ్రాడ్‌లు, డిజిటల్‌ అరెస్టు స్కామ్‌లు ఉన్నట్లు వెల్లడించారు. చైనా పౌరుల సహకారంతో నడుస్తున్న డిజిటల్‌ అరెస్టు మోసం పెద్ద ఎత్తున జరుగుతోందని, దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు అధికారులు చెప్పారు.

ఉదాహరణగా.. తాజాగా ఒక 62 ఏళ్ల వృద్ధుడి నుంచి రూ.1.07 కోట్లు దోచుకున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే అదృశ్యమైన మొబైల్‌ ఫోన్‌ ద్వారా బ్యాంక్‌ అకౌంట్‌ల నుంచి రూ.1.95 లక్షలు ట్రాన్స్‌ఫర్‌ చేసిన ముగ్గురు నిందితులను కూడా పట్టుకున్నారు. మరో ఘటనలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఒక ఫేక్‌ ట్రేడింగ్‌ యాప్‌ ద్వారా రూ.24.17 లక్షలు మోసం చేసినట్లు గుర్తించి అతనిని అరెస్టు చేశారు.

పోలీసులు ఇప్పటి వరకు నిందితుల వద్ద నుంచి 31 మొబైల్‌ ఫోన్లు, 14 చెక్‌బుక్‌లు, 9 డెబిట్‌ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. సైబర్‌ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద లింకులు, ఫోన్‌ కాల్స్‌, ఫేక్‌ యాప్‌లు వంటివాటిని ఉపయోగించవద్దని హెచ్చరించారు. ఇలాంటి మోసాలకు బలికాకుండా ఉండేందుకు సైబర్‌ పోలీసుల హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1930కు ఫిర్యాదు చేయాలని, cybercrime.gov.in వెబ్‌సైట్‌ ద్వారా కూడా సమాచారం అందించాలని అధికారులు సూచించారు.

The Family Man Season 3 : ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 ట్రైలర్ రిలీజ్..

Exit mobile version