Site icon NTV Telugu

Crime: మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. దారుణ విషయాలు వెలుగులోకి!

Hyd Crime

Hyd Crime

Hyderabad Crime: హైదరాబాద్ శివార్లలోని నార్సింగి ప్రాంతంలో అదృశ్యమైన మైనర్ బాలిక కేసు సంచలన మలుపు తిరిగింది. మూడు రోజుల క్రితం పుప్పాలగూడా పాషా కాలనీలోని తన ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలిక తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. తమ కూతురు కనిపించడం లేదంటూ వారు నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు ప్రారంభించారు. దర్యాప్తు కొనసాగుతున్న క్రమంలో బాలిక అదృశ్యం వెనుక దారుణ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

2028 T20 Worldcup.. డైరెక్ట్ ఎంట్రీ సాధించిన 12 జట్లు..!

పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం.. సోహెల్ అనే యువకుడు బాలికను నమ్మించి తనతో పాటు బయటకు తీసుకెళ్లాడు. అనంతరం ఘట్‌కేసర్ సమీపంలోని రాంపూర్ ప్రాంతానికి తీసుకెళ్లి, తన స్నేహితులు అర్బాజ్, ఇమ్రాన్‌తో కలిసి బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితులు గంజాయి సేవించిన అనంతరం బాలికపై ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. బాలికను మోసం చేసి తీసుకెళ్లి, పథకం ప్రకారం ఈ నేరానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు వెంటనే చర్యలు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Abhishek Sharma Form: 0, 0, 0.. అభిషేక్ షర్మ ఫామ్‌పై సూర్య ఏమన్నాడంటే?

Exit mobile version