Site icon NTV Telugu

Hyderabad : హైదరాబాద్ లో కారు బీభత్సం.. పలువురికి గాయాలు..

Hyderabad Pathabasti

Hyderabad Pathabasti

హైదరాబాద్ లో వరుస ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.. వాహనాలను వేగంగా నడపవద్దని అధికారులు చెప్తున్నా జనాలు లెక్కచెయ్యడం లేదు.. ఇప్పుడు మరో ఘటన వెలుగు చూసింది..తాజాగా ఓ కారు బీభత్సాన్ని సృష్టించింది.. మితిమీరిన వేగంతో ఒక్కసారిగా కారు దూసుకొచ్చింది. పాతబస్తీ రెయిన్ బజార్‌లో మైనర్ల ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ప్రమాదం జరిగింది.అతివేగంతో వాహనదారుడిపైకి కారు దూసుకెళ్లింది..

ఈ ప్రమాదంలో కారులోని ముగ్గురు మైనర్లకు కూడా గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు.. క్షత గాత్రులను ఉస్మానియాకు తరలించారు.. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మైనర్ ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

మైనర్లు డ్రైవింగ్ చేస్తూ చాలా చోట్ల ప్రమాదాలకు కారణమవుతున్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై పోలీసులు చర్యలు చేపట్టినా వాటిని కొందరు ఏమాత్రం లెక్కచేయడం లేదు. నిబంధనలు పాటించకపోవడం వల్లే మైనర్లు ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అంటున్నారు.. ఈ ప్రమాదంలో కొందరు గాయపడినట్లు సమాచారం..

Exit mobile version