NTV Telugu Site icon

Hyderabad: బాచుపల్లిలో దారుణం.. సాఫ్ట్‌వేర్ ఇంజనీరైన భార్యను చంపిన భర్త..

Husband Kills Wife

Husband Kills Wife

Hyderabad: హైదరాబాద్‌లో దారుణం జరిగింది. కుటుంబ కలహాలు మరో ప్రాణాన్ని బలితీసుకున్నాయి. కంటికి రెప్పలా కాపాడాల్సిన భర్తనే భార్యను కడతేర్చాడు. ఈ దారుణహత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాచుపల్లి ఏరియాలో నివాసం నాగేంద్ర భరద్వాజ తన భార్య మధులతను దారుణంగా హతమార్చాడు. మధులత తలపై సుత్తెతో మోడి కత్తితో మెడపై పొడిచి హత్య చేశాడు. ముక్కలు ముక్కలుగా కోసేందుకు ప్రయత్నించాడు. గ్యాస్ లీకేజ్ చేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఈ నెల 4న మధులతను హత్య జరిగింది. బాధిత మహిళ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. నిందితుడైన నాగేంద్రని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు.

Read Also: Earth-Sized Planet: 40 కాంతి సంవత్సరాల దూరంలో భూమి లాంటి గ్రహం..జీవానికి ఛాన్స్..

గత కొంత కాలంగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని తెలుస్తోంది. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు నాగేంద్రను అరెస్ట్ చేసిన రిమాండ్‌కి తరలించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 20 రోజుల క్రితం ఈ ఘటన జరిగినట్లు నిందితుడు నాగేంద్ర రిమాండులో ఉన్నట్లు సీఐ తెలిపారు.

వరకట్న వేధింపుల వల్లే తమ కూతురిని అల్లుడు భరద్వాజ్ క్రూరంగా హత్య చేశాడని మధులత తల్లిదండ్రులు ఆరోపించారు. డబ్బులు తెమ్మని నా కూతురిని వేధించేవాడని, పలుమార్లు గొడవలు అయ్యాయని చెప్పారు. 2020లో వీరికి వివాహం జరిగిందని మధులత తల్లిదండ్రులు చెప్పారు. వీరికి ఏడాది బాబు ఉన్నాడు. తన కుమార్తెను భరద్వాజ్‌తో పాటు ఆమె అత్తమామలు కూడా కొట్టేవారని, తాము బాచుపల్లి పీఎస్‌లో కూడా ఫిర్యాదు చేశామని వెల్లడించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కూతురిని చంపాడని, నిందితుడిని కఠినంగా శిక్షించి, తమకు న్యాయం చేయాలని వారు కోరారు.

Show comments