NTV Telugu Site icon

Hyderabad: హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ పైనుంచి దూసుకెళ్లిన లారీ..

Medchal

Medchal

హైదరాబాద్ లో వరుస ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.. హైవే లపై స్పీడ్ లిమిట్ పెట్టినా కూడా వాహనాదారులు పాటించడం లేదు.. దాంతో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు.. నిన్న కారు ప్రమాదం జరిగింది.. నేడు మరో ఘోర ప్రమాదం జరిగింది.. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. ఇద్దరు గాయపడ్డారు..

ఈ ఘోర ప్రమాదం మేడ్చల్ లో వెలుగు చూసింది.. శామీర్ పెట్ కీసర దగ్గర ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మూడు వాహనాలు ఢీకన్ని ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఔటర్ రింగ్ రోడ్డుపై 66 కిమీ నెంబర్ వద్ద లారీ, టాటా ఏసీఈ, కారు పరస్పరం ఢీకొన్నాయి.. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయాని పోలీసులు తెలుపుతున్నారు.. ఈ ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.. సంఘటన స్థలానికి చేరుకున్న మేడ్చల్ ట్రాఫిక్ సిఐ హనుమాన్ గౌడ్ పరిస్థితులను పర్యవేక్షించారు.

బోలేరో ట్రాలీ లో ఉన్న ఇద్దరు, లారీ డ్రైవర్ ఈ ప్రమాదంలో మరణించారని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్కేసర్ నుండి మేడ్చల్ వైపు వెళ్తున్న లారీ అదుపు తప్పి డివైడర్ పైనుండి ఎగిరి ఎదురుగా వస్తున్న బొలెరో ట్రాలీ, కారును డీ కొట్టింది.. కాగా, బొలెరోలో ప్రయాణిస్తున్న నలుగురిలో ఇద్దరు స్పాట్ లో మరణించగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. లారీలో ఉన్న ఇద్దరు వ్యక్తులలో ఒకరు మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.. మృత దేహాలను పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించగా, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..