NTV Telugu Site icon

Extramarital Affair: మరొకరితో భార్య ఎఫైర్.. భర్తకు తెలిసి ఏం చేశాడో తెలుసా?

Tamilnadu Affair Crime

Tamilnadu Affair Crime

Husband Killed A Man For Having Affair With His Wife In Tamilnadu: రెండు నిమిషాల కామక్రీడ కోసం కొందరు మహిళలు దారి తప్పుతున్నారు. భర్త ఉండగానే మరొకరితో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఇది తప్పని, ఘోర పరిణామాలకు దారితీస్తుందని తెలిసినా.. కామకోరికలు తీర్చుకోవడం కోసం బరితెగించేస్తున్నారు. దాంతో.. అనుకోని దారుణాలు వెలుగుచూస్తున్నాయి. కాపురాలు కూలిపోవడమో, హత్యలు వంటి నేరాలు చోటు చేసుకోవడమే జరుగుతున్నాయి. ఇప్పుడో భర్త కూడా అలాంటి ఘాతుకానికే పాల్పడ్డాడు. మరొకరితో తన భార్య రాసలీలలు సాగించడం చూసి తట్టుకోలేకపోయిన ఆ భర్త.. భార్య ప్రియుడ్ని హత్య చేశాడు. మధురై సమీపంలో జరిగిన ఈ ఘటన ఆ వివరాల్లోకి వెళ్తే..

Lover Suicide: ప్రియుడి ఆత్మహత్య.. మనస్థాపంతో ఒంటికి నిప్పంటించుకుని..

శరవణ మరుదుకు జిల్లా కండాంగిపట్టికి చెందిన శక్తివేల్ అనే తన భార్యతో కలిసి నివాసముంటున్నాడు. సజావుగానే సాగుతున్న వీరి సంసార జీవితంలోకి.. శరవణ మరుదు (32) అనే వ్యక్తి వచ్చాడు. దాంతో పరిస్థితులన్నీ మారిపోయాయి. శక్తివేల్ భార్య ఆ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఎవ్వరికీ తెలియకుండా తమ రాసలీలల్ని కొంతకాలం వరకూ సాగించారు. కానీ.. భార్య ప్రవర్తనలో మార్పు రావడాన్ని చూసి భర్తకు అనుమానం కలిగింది. అతడు నిఘా పెట్టసాగాడు. ఈ క్రమంలోనే భార్య ఎఫైర్ గురించి తెలిసింది. అప్పటినుంచి భార్య ప్రియుడు శరవణపై భర్త పగ పెంచుకున్నాడు. ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్న శక్తి వేల్.. తన బంధవులైన రాజప్రభు, మురుగన్‌తో కలిసి శరవణ హత్యకు కుట్ర పన్నాడు.

Gold Price: మహిళలకు గుడ్ న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధర

ఈనెల 14వ తేదీన శరవణ ఓ పని నిమిత్తం బయటకు వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న శక్తి వేల్.. తన బంధువుల్ని రప్పించి, అతడ్ని అంతమొందించాడు. ఆ తర్వాత ఏమీ ఎరుగనట్టుగా వ్యవహరించాడు. ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు.. అతనికి శక్తి వేల్ భార్యతో వివాహేతర సంబంధం ఉందన్న విషయాన్ని గుర్తించారు. దీంతో భర్తపై అనుమానం కలిగి ప్రశ్నించగా.. తన బంధువులతో కలిసి తానే శరవణని అంతమొందించినట్టు నేరం అంగీకరించాడు. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకోవద్దని సూచించినా వినకపోవడంతో.. ఈ ఘాతుకానికి పాల్పడాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. పోలీసులు అతనితో పాటు రాజప్రభు, మురుగన్‌లని అరెస్ట్ చేశారు.

Show comments