Site icon NTV Telugu

ప్రియురాలితో భర్త కాపురం.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని చితకొట్టిన భార్య!

వివాహేతర సంబంధాలు.. పచ్చని కాపురాలలో నిప్పులు పోస్తున్నాయి. పరాయివారి మోజులో భార్య/భర్తను గాలికి వదిలేసి తమ సుఖాన్ని చూసుకుంటున్నారు. ఈ వివాహేతర సంబంధాల వలన ఎన్నో కుటుంబాలు బలవుతున్నాయి.. మరికొన్ని కుటుంబాల పరువు రోడ్డున పడుతున్నాయి. తాజాగా ఒక భర్త, భార్యను వదిలి ప్రియురాలితో కాపురం పెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య రెడ్ హ్యాండెడ్ గా వారిద్దరిని పట్టుకొని దుమ్ము దులిపింది. భర్త కాలర్ పట్టుకొని చెడామడా వాయించేసింది. కె.పి.హెచ్.బి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది.

వివరాలలోకి వెళితే.. గుంటూరు జిల్లా, పెద్దపరిమికి చెందిన ప్రకాష్ కు 2019లో అదే జిల్లాకు చెందిన త్రివేణి అనే యువతితో వివాహం జరిగింది. వివాహం సమయంలో వరకట్నంగా 20 లక్షల నగదు, 30 సవర్ల బంగారు ఆభరణాలు, 3 ఎకరాల భూమి ఇచ్చారు. ప్రకాష్ బంజారాహిల్స్ లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో చార్టర్డ్ అకౌంటెంటుగా పని చేస్తుండడంతో భార్యను తీసుకొని హైదరాబాద్ లో మకాం పెట్టాడు.

పెళ్లైన నెల రోజులకే త్రివేణికి నరకం చూపించాడు. అకారణంగా హింసించడం, రాత్రుళ్లు ఇంటికి రాకుండా ఉండడం, భార్య ప్రైవేట్ ఫోటోలను స్నేహితులకు చూపిస్తూ ఆనందించేవాడు. ఈ విషయాలు తెలిసిన త్రివేణి లోపల బాధపడుతూనే భర్తతో కాపురం చేసున్నది. ఈ నేపథ్యంలోనే భర్త మరో మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నట్లు తెలుసుకున్న త్రివేణి, తన కుటుంబ సభ్యులతో కలిసి, భర్త, ప్రియురాలు నివసిస్తున్న ఇంటికి వెళ్లి రెడ్ హ్యాండెడ్ గా వారిద్దరిని పట్టుకున్నారు. భర్త వేరొక అమ్మయితో ఉండడం చూసిన త్రివేణి కోపంతో రగిలిపోతూ ప్రకాష్ ని చితకబాదింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రకాష్ ని, అతని ప్రియురాలిని అరెస్ట్ చేశారు.

Exit mobile version