NTV Telugu Site icon

Hotel Staff Attack: రెచ్చిపోయిన హోటల్ సిబ్బంది.. ఒకరి మృతి

Bapatla Volunteer Died

Bapatla Volunteer Died

హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ లో ఘోరం జరిగింది. హోటల్ సిబ్బంది రెచ్చిపోయి దాడికి పాల్పడ్డారు. మహ్మద్ హుస్సేన్ అనే బాలుడిని కర్రలతో దాడి చేశారు. హోటల్ సిబ్బంది దాడి లో తీవ్రంగా గాయపడ్డ బాలుడు అనంతరం ఆస్పత్రిలో మరణించాడు. దాడిలో గాయపడ్డ మహ్మద్ హుస్సేన్ ని హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మహ్మద్ హుస్సేన్ మృతి చెందాడు.

మహ్మద్ హుస్సేన్ తమ్ముడిపై గంజి పోశారు హోటల్ లో పని చేసే సిబ్బంది. తమ్ముడి పై గంజి ఎందుకు పోసారని హోటల్ సిబ్బందిని నిలదీశాడు మహ్మద్ హుస్సేన్. దీంతో హోటల్ సిబ్బందికి మహ్మద్ హుస్సేన్ కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒక్కసారిగా రెచ్చిపోయిన సిబ్బంది దాడి చేశారు. మహ్మద్ హుస్సేన్ పై మూకుమ్మడిగా దాడి చేశారు సిబ్బంది. సిబ్బంది దాడిలో తీవ్రంగా గాయపడ్డ మహ్మద్ హుస్సేన్ మృతిచెందడంతో వివాదం ముదిరింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు రాజేంద్రనగర్ పోలీసులు. దాడికి పాల్పడ్డ వారి కోసం గాలిస్తున్నారు పోలీసులు. చిన్న గొడవలకే దాడులు చేయడం, అవతలి వ్యక్తుల మరణానికి కారణం కావడం కలకలం రేపుతోంది.

అధిక వడ్డీల పేరుతో..

హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అధిక వడ్డీలు,చిట్టీల పేరుతో ఘరానా మోసం బయటపడింది. అధిక వడ్డీలు ఆశ చూపి 3 కోట్ల వరకూ మోసం చేసింది గజ్జి సుజాత అనే మహిళ. ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని బాధితులు అడుగుతుండటంతో ఆత్మహత్య చేసుకుంటానని సుజాత బెదిరింపులకు పాల్పడింది. దీంతో లబోదిబోమంటున్నారు బాధితులు. సుమారు 100 మంది వరకు బాధితులు హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో గజ్జి సుజాత మోసంపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు హయత్ నగర్ పోలీసులు.

Crime News: బాపట్లలో దారుణం.. మహిళా వాలంటీర్ దారుణ హత్య