Honor X9e s Launched: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ప్రముఖ బ్రాండ్ Honor మరో కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. తాజాగా Honor X9e s పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను సౌదీ అరేబియాలో లాంచ్ చేసింది. సరసమైన ధరలో అధునాతన ఫీచర్లను అందించే లక్ష్యంతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన AMOLED డిస్ప్లే, Qualcomm Snapdragon 6 Gen 4 ప్రాసెసర్, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా ఈ ఫోన్లో ఏకంగా 8,560mAh భారీ బ్యాటరీని అందించారు. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే మూడు రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుందని కంపెనీ వెల్లడించింది. మరి ఈ కొత్త Honor స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Honor X9e s స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ ప్రస్తుతం సౌదీ అరేబియాలో విడుదల చేసింది. దీని ధర 1,499 సౌదీ రియాల్స్‌గా నిర్ణయించారు. భారత కరెన్సీలో సుమారు రూ.38,000 అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను మూడు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి తీసుకొచ్చారు.
Dawn Orange
Glacier White
Midnight Black
కంపెనీ అధికారిక వెబ్సైట్లో ఈ ఫోన్‌ను లిస్ట్ చేసింది. అయితే భారత మార్కెట్లో లాంచ్ తేదీ, ధరకు సంబంధించిన వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.79 అంగుళాల AMOLED డిస్ప్లేను అందించారు. ఇది 1.5K రిజల్యూషన్‌తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇందులో 1,800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అందించారు. 3840Hz PWM డిమ్మింగ్ సపోర్ట్ కూడా ఉంది. దీనివల్ల తక్కువ బ్రైట్నెస్లో స్క్రీన్ ఫ్లికరింగ్ను తగ్గించడంలో సహాయపడుతుంది.
పనితీరు విషయానికి వస్తే Honor X9e sలో Qualcomm Snapdragon 6 Gen 4 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. గ్రాఫిక్స్ కోసం Adreno 810 GPUను అందించారు. ఈ ఫోన్ 8GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లో అందుబాటులో ఉంది. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. దీనిపై కంపెనీ సొంత MagicOS 10 యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది.
ఫోటోగ్రఫీ కోసం ఈ ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్‌ను అందించారు.
50MP ప్రైమరీ కెమెరా
5MP అల్ట్రావైడ్ కెమెరా
16MP ఫ్రంట్ సెల్ఫీ కెమెరా
50MP మెయిన్ కెమెరాతో ఫొటోలు తీయవచ్చు. 5MP అల్ట్రావైడ్ కెమెరా ద్వారా ఎక్కువ విస్తీర్ణాన్ని ఒకే ఫ్రేమ్‌లో క్యాప్చర్ చేయవచ్చు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 16MP కెమెరాను అందించారు.
Honor X9e s స్మార్ట్‌ఫోన్‌లో అత్యంత ఆకర్షణీయమైన ఫీచర్ దాని బ్యాటరీ. ఇందులో ఏకంగా 8,560mAh కెపాసిటీ కలిగిన భారీ బ్యాటరీని అమర్చారు. 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందించారు. భారీ బ్యాటరీని అందించినప్పటికీ ఈ ఫోన్‌ను స్లిమ్ డిజైన్‌తో రూపొందించడం విశేషం. దీని మందం కేవలం 7.76 మిల్లీమీటర్లు మాత్రమే. ఫోన్ బరువు 196 గ్రాములుగా ఉంది.

