ఆన్ లైన్ లో ఒక అమ్మాయి పరిచయం అయ్యింది.. ఆ పరిచయం కాస్తా వాట్సాప్ చాటింగ్ వరకు వచ్చింది. అమ్మాయి హస్కీ వాయిస్ కి ఫిదా అయిపోయాడు ఆ యువకుడు.. ఇంకేముంది గంటల తరబడి ఫోన్ లో కబుర్లు.. ఒకరోజు రాత్రి వీడియో కాల్ చేసింది.. యువకుడు గాల్లో తేలిపోయాడు. అమ్మాయి ఫేస్ చూపించకుండానే తన బట్టలు విప్పమని అడిగింది. అమ్మాయి అడిగితే కాదంటానా..? అని ఐదు నిమిషాల్లో నగ్నంగా మారిపోయాడు. మరో ఐదు నిమిషాల్లో ఫోన్ కట్ అయ్యింది.. ఆ తరువాత ఆ యువకుడి జీవితమే మారిపోయింది. తాను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఆ నగ్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తామని బెదిరించడం మొదలుపెట్టారు. దీంతో పరువు ఎక్కడ పోతుందో అని వాళ్లు ఎంత కావాలంటే అంత ఇచ్చేస్తూ వచ్చాడు. అయినా వారి బుద్ధి మాత్రం మారలేదు. దీంతో చేసేదేం లేక ఆ యువకుడు చివరికి పోలీసులను ఆశ్రయించాడు.
ప్రస్తుతం హానీ ట్రాప్ మోసాలు ఎక్కువైపోతున్నాయి.. అమ్మాయి కాల్ చేసి మాట్లాడుతుందని, న్యూడ్ కాల్స్ చేయమని అడిగిందని తొందరపడితే మొదటికే మోసం వస్తుంది. అమ్మాయిలా గొంతుమార్చి, ఫోటోలను అంర్ఫింగ్ చేసి సైబర్ నేరగాళ్లు యువకులకు వాలా విసురుతున్నారు. తాజాగా హైదరాబాద్ కి చెందిన ఒక యువకుడు హానీ ట్రాప్ లో చిక్కుకొని రూ.4 లక్షలు వదిలించుకున్నారు. తనతో న్యూడ్ కాల్స్ మాట్లాడించుకొని, దాన్ని రికార్డ్ చేసి బెదిరిస్తునట్లు యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇప్పటివరకు రూ.4 లక్షలు వారికి ఇచ్చానని, వారు ఇంకా డబ్బు అడుగుతున్నట్లు తెలిపాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్న పోలీసులు విచారణ చేపట్టారు.