HM Attack on Teacher: ఉపాధ్యాయులు అంటేనే.. రేపటి భావి భారత పౌరులను తయారు చేయాల్సినవారు.. నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన వ్యక్తులు.. కానీ, వారె దారితప్పితే ఏంటి పరిస్ధితి.. ఒకరేమో తాగేసి స్కూల్‌కు వస్తారు.. ఇది సరికాదని వారించిన మరో టీచర్‌పై దాడికి దిగడం చర్చగా మారింది.. విజయనగరం జిల్లాలో మెంటాడ మండలం కుంటినవలస జెడ్పీ హై స్కూల్ హెడ్ మాస్టర్ ముగడ రామకృష్ణారావు, అదే పాఠశాలలో పని చేస్తున్న ఇంగ్లీషు ఉపాధ్యాయుడిని కొట్టిన ఘటన కలకలం రేపుతోంది. రామకృష్ణారావు మద్యం సేవించి తరచూ పాఠశాలకు రావడం.. పాఠశాల ప్రతిష్టకు భంగం కలిగిస్తోందని విద్యా కమిటీ చైర్మన్ పెదిరెడ్ల సత్యనారాయణ డిప్యూటీ డీఈవో మోహనరావుకు ఫిర్యాదు చేశారు.
Read Also: AP Assembly : జీఎస్టీ సంస్కరణలతో ప్రతి ఒక్కరికి లాభం జరుగుతుందని ఘంటాపథంగా చెప్తున్న సీఎం చంద్రబాబు
ఈ నేపథ్యంలో పాఠశాలకు విచారణకు వచ్చిన డిప్యూటీ డీఈవో సమక్షంలోనే హెచ్ఎం రామకృష్ణారావు అసహనానికి లోనయ్యాడు.. తోటి ఉపాధ్యాయుడు పెదిరెడ్ల సూర్యారావుపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఇదే సమయంలో స్కూల్ ఆవరణంలో మద్యం సీసాలు బయటపడ్డాయి. విద్యా కమిటీ చైర్మన్ ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు. ఇలాంటి వ్యక్తులు విద్యా రంగంలో కొనసాగడమేమిటని ప్రశ్నిస్తూ, తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.. చేసిందే తప్పు.. ఇక, తనపై పై అధికారుల ముందు నిజాలు చెప్పడంతో తట్టుకోలేకపోయిన హెచ్‌ఎం.. తోటి టీచర్‌పై దాడి చేయడంపై ప్రజలు మండిపడుతున్నారు..
