Site icon NTV Telugu

Shocking M*urders: “అందంగా ఉంటే అసూయ”.. కోడలు, కొడుకుతో సహా నలుగుర్ని చంపేసిన క్రూరురాలు..

Haryana Murders

Haryana Murders

Shocking M*urders: తన కన్నా ‘‘అందం’’గా ఉంటే జీర్ణించుకోలేని మనస్తత్వం ఒక మహిళను క్రూరురాలిగా మార్చింది. చిన్న పిల్లలు అని చూడకుండా పసిపిల్లల్ని దారుణంగా హత్య చేసింది. హర్యానాలోని పానిపట్‌లో జరిగిన 6 ఏళ్ల చిన్నారి మరణాన్ని దర్యాప్తు చేసిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. 6 ఏళ్ల మేనకోడలిని హత్య చేసినందుకు ఒక మహిళను బుధవారం పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఎవరూ కూడా తన కన్నా అందంగా కనిపించకూడదనే భావనతోనే ఈ దారుణాలకు పాల్పడినట్లు తేలింది.

సోమవారం సోనిపట్‌లో కుటుంబ సభ్యులందరూ వివాహ వేడుకకు హాజరైనప్పుడు, నిందితురాలు పూనమ్ తన మేనకోడలని నీటి తొట్టిలో ముంచి చంపేసింది. పూనమ్ గతంలో 2023లో తన కొడుకుతో సహా ముగ్గురు పిల్లల్ని చంపింది. ఆమె తన మేనకోడలిలాగే వారిని కూడా నీటిలో ముంచి చంపింది.

హత్య ఎలా జరిగింది?

చిన్నారి విధి సోనిపట్‌లో నివసిస్తోంది. తన కుటుంబంతో బంధువుల వివాహానికి హాజరుకావడానికి పానిపట్ లోని ఇస్రానా ప్రాంతంలోని నౌల్తా గ్రామానికి వచ్చింది. ఆమెతో పాటు ఆమె తాత పాల్ సింగ్, అమ్మమ్మ ఓంవతి, తండ్రి సందీప్, తల్లి వచ్చారు. సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో వివాహ ఊరేగింపు నౌల్తా గ్రామానికి చేరుకున్న సమయంలో ఈ హత్య జరిగింది. కుటుంబం ఊరేగింపుతో వెళ్లి పోయింది.

దీని తర్వాత విధి కనిపించడం లేదంటూ తండ్రికి ఫోన్ కాల్ వచ్చింది. కుటుంబం మొత్తం ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. దాదాపు గంట తర్వాత, ఆమె అమ్మమ్మ ఓంవతి, వారి బంధువుల ఇంటి మొదటి అంతస్తులోని స్టోర్ రూంలోకి వెళ్లింది. స్టోర్ రూం తలుపులు బయట నుంచి బోల్ట్ పెట్టి ఉంది. ఓంవంతి డోర్ తెరిచిన తర్వాత షాకింగ్ దృశ్యాన్ని చూసింది. విధి తల నీటి టబ్‌లో ముగిగిపోయి, కాళ్లు నేలపై ఉన్న స్థితిలో కనిపించింది. బాలికను స్థానికంగా ఉన్న మెడికల్ కాలేజీకి తీసుకెళ్లారు. అప్పటికే బాలిక మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసుల విచారణలో విధి అత్త పూనమ్ ఆమెను చంపినట్లు తేలింది.

అందంగా ఉంటే హత్య:

పూనమ్ తన కెంటే అందంగా ఎవరూ కనిపించకూడదని కోరుకునేదని, ఎవరైనా తన కన్నా అందంగా ఉంటే అసూయ, ఆగ్రహంతో రగిలిపోయేదని, పిల్లల్ని నీటిలో ముంచి చంపేదని తేలింది. ముగ్గురు బాలికను, సొంత కొడుకును కూడా ఇలాగే చంపినట్లే అంగీకరించింది. 2023లో పూనమ్ తన వదిన కుమార్తెను చంపింది. అదే ఏడాది అనుమానం రాకుండా ఉండటానికి తన కొడుకును కూడా నీట ముంచి చంపింది. ఈ ఏడాది ఆగస్టులో పూనమ్ సివా గ్రామంలో మరో అమ్మాయిని హత్య చేసింది.

ప్రతీ మరణమూ కూడా ఒకే విధంగా జరిగాయి. పిల్లలు లోతు లేని నీటిలో ముగినిపోయారు. ఒక కేసులో టబ్ ఒక అడుగు లోతు మాత్రమే ఉండటంతో, ఆ చిన్నారి ఎత్తు బట్టి ప్రమాదవశాత్తు మరణించే అవకాశం ఉందా అనే దానిపై దర్యాప్తు అధికారులు సందేహాలు కూడా వ్యక్తం చేశారు. తాజాగా చేసిన హత్యను పోలీసులు కేవలం 36 గంటల్లోనే ఛేదించారు. విచారణలో ప్రశ్నించగా నలుగుర్ని తానే చంపినట్లు ఆమె ఒప్పుకుంది. ముగ్గురు ఆమె బంధువులైన అమ్మాయిలు, ఆమె కొడుకు కూడా మృతుల జాబితాలో ఉన్నాడు.

Exit mobile version