Haryana Girl Neelam Case: ప్రేమ కోసం కెనడా నుంచి వస్తే.. దారుణంగా కాల్చి చంపాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Haryana Girl Neelam Shot By Her Boyfriend After She Came From Canada: పాపం ఆ యువతి.. తన ప్రియుడితో కలిసి జీవితం పంచుకోవాలని ఎన్నో కలలు కంది. ప్రియుడి పిలుపు మేరకు.. ఏమీ ఆలోచించకుండా కెనడా నుంచి ఇండియాకు తిరిగొచ్చేసింది. ఇక అతనితోనే తన జీవితమని భావించింది. కానీ.. ఆ దుర్మార్గుడు మాత్రం అత్యంత దారుణంగా ఆమెను కాల్చి చంపాడు. కేవలం ఆమెను అనుభవించాలన్న ఉద్దేశంతో.. ప్రేమ నాటకం ఆడాడు, పెళ్లి చేసుకుంటానని నమ్మించి, కెనడా నుంచి రప్పించాడు. ఆపై తాను చేసిన నేరాన్ని కప్పిపుచ్చేందుకు శవాన్ని ఎవ్వరికీ దొరక్కుండా దాచాడు. చివరికి.. 10 నెలల తర్వాత అతడు పట్టుబడ్డాడు. ఈ కేసులో వివరాల్లోకి వెళ్తే..
Hair Cut: బార్బర్ చేసిన హెయిర్ కట్ నచ్చలేదని.. బాత్రూంలోకి వెళ్లి..
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
హర్యానకు చెందిన నీలం అనే 23 ఏళ్ల యువతి.. ఉద్యోగం నిమిత్తం కెనడాకు వెళ్లింది. అయితే.. ఆమె కెనడాకు వెళ్లడానికి ముందే సునీల్ అనే వ్యక్తిని ప్రేమించింది. కెనడాకు వెళ్లిన తర్వాత అతడ్ని విడిచి ఎక్కువకాలం ఉండలేకపోయింది. నీతోనే కలిసి జీవితం పంచుకోవాలని ఉందని నీలం తెలిపింది. దీంతో.. గతేడాది జనవరిలో ‘మనం పెళ్లి చేసుకుందాం, ఇండియాకి తిరిగొచ్చెయ్’ అని సునీల్ చెప్పాడు. మరో క్షణం ఆలోచించకుండా.. ఆ యువతి భారత్‌కు వచ్చేసింది. భారత్‌కు తిరిగొచ్చిన తర్వాత నీలం ఒకరోజు హఠాత్తుగా కనిపించకుండా పోయింది. ఆమెతో పాటు సునీల్ కూడా కొన్ని రోజుల పాటు మాయం అయ్యాడు. దాంతో.. నీలం కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. వాళ్లిద్దరు ఎక్కడికైనా పారిపోయారేమోననుకొని, పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Extramarital Affair: దారుణం.. నాలుగు నెలల గర్భిణిని బలి తీసుకున్న ‘వివాహేతర సంబంధం’
నీలం కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు.. పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. అయితే.. ఈ కేసులో ఎలాంటి పురోగతి కనిపించకపోవడంతో నీలం ఫ్యామిలీ మెంబర్స్ హర్యానా హోంమంత్రిని కలిశారు. ఆయన సూచన మేరకు కేసుని క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి బదిలీ చేశారు. ఆ ఏజెన్సీ ఈ కేసుని టేకప్ చేసుకున్న వెంటనే.. సునీల్ ఆచూకీ కనుగొని, అతడ్ని అరెస్ట్ చేసింది. తమదైన శైలిలో అధికారులు అతడ్ని విచారించారు. అప్పులు అసలు నిజం వెలుగులోకి వచ్చింది. తాను నీలంని కిడ్నాప్ చేసి, హతమార్చానని నేరం అంగీకరించాడు. ఆమె తలపై రెండుసార్లు కాల్చి చంపానని, మృతదేహాన్ని తన పొలంలో పాతిపెట్టానని తెలిపాడు. ఈ విచారణలో భాగంగానే.. సునీల్‌పై అరడజనకు పైగా హత్య కేసులు ఉన్నట్టు తేలింది.
తాజావార్తలు
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
-
Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
-
MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!