Wife killed Husband: ప్రియుడితో కలవడానికి అడ్డంగా ఉన్నాడని భర్తను పక్కా ప్లాన్ తో హతమార్చిందో కసాయి భార్య. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరుకు చెందిన శివనాగరాజు, మాధురికు 2007లో పెళ్లయ్యింది. వీరికి ఇద్దరు సంతానం. మాధురి విజయవాడలో సినిమా హాల్ లో టికెట్ కౌంటర్ లో పనిచేసే సమయంలో సత్తెనపల్లికి చెందిన గోపితో పరిచయమయ్యింది. అదికాస్తా వివాహేతర సంబంధంగా మారింది.
Sudha Kongara : పరాశక్తి ప్లాప్ నుండి తప్పించుకున్న విజయ్ దేవరకొండ, అభిషేక్ బచ్చన్
ఆ తర్వాత భర్తను హైదరాబాదులో ట్రావెల్స్ వ్యాపారం చేస్తున్న గోపి వద్దకు ఉద్యోగం పేరుతో పంపించింది. కొన్నాళ్ల తర్వాత శివనాగరాజు చిలువూరు వచ్చి ఇంటినుంచే వ్యాపారం చెయ్యడం మొదలుపెట్టాడు. దీంతో మాధురికి ప్రియుడు గోపితో కలిసేందుకు ఇబ్బందిగా మారింది. ఎలాగైనా భర్త అడ్డు తొలగించుకోవాలని భావించింది పక్కా పధకం ప్రకారం బిర్యానీలో నిద్ర మాత్రలు కలిపి భర్తకు పెట్టింది.
IND vs NZ T20: అభిషేక్ శర్మ వన్ మ్యాన్ షో.. కివిస్ పై టీమిండియా భారీ విజయం.!
నిద్రమాత్రలు కలిపిన బిర్యాని తిని నిద్రపోయిన భర్తను ప్రియుడు గోపితో కలిసి అత్యంత దారుణంగా హత్య చేసింది. రాత్రంతా భర్త మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టి పోర్న్ వీడియోలు కూడా చూసింది భార్య. ఉదయాన్నే గుండెపోటుతో చనిపోయాడని అందరిని నమ్మించింది. కాకపోతే అనుమానం వచ్చిన మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హత్య వ్యవహారం బయటపడింది. భార్య మాధురి, ఆమె ప్రియుడు గోపిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మరికొన్ని వివరాలను పోలీసులు వెల్లడించనున్నారు.
