Gujarat Gang-Rape: గుజరాత్ సూరత్ జిల్లాలో టీనేజ్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుల్లో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఇద్దరు నిందితుల్లో ఒకరు గురువారం విచారణ సమయంలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీస్ కస్టడీలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని ఎదుర్కోవడంతో ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత అతను మరణించాడు. గతంలో హత్య, దొంగతనం కేసుల్లో పేరున్న శివశంకర్ చౌరాసియా(45), మున్నా పాశ్వాన్(40)లు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. బుధవారం వీరిని అరెస్ట్ చేశారు.
‘‘ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో చౌరాసియా శ్వాస తీసుకోవడంతో ఇబ్బందిగా ఉందని ఫిర్యాదు చేయడంతో వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాం. చికిత్స తీసుకుంటున్న సమయంలోనే ఆయన మరణించాడు’’ అని సూరత్ జిల్లా ఎస్పీ హితేష్ జోయ్సర్ చెప్పారు. పాశ్వాన్‌ని రిమాండ్ కోరుతూ ఈ రోజు సాయంత్రం కోర్టు ముందు పోలీసులు హాజరుపరిచారు.
Read Also: Ratan Tata family tree: రతన్ టాటా ‘‘వంశ వృక్షం’’ ఇదే.. ఎవరికి టాటా గ్రూప్ దక్కుతుంది..?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాశ్వాన్, చౌరాసియాతో పాటు మరో నిందితుడు మంగళవారం రాత్రి మంగ్రోల్ తాలుకాలో 17 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. టీనేజర్ తన కోచింగ్ క్లాస్‌కి హాజరై, తన స్నేహితుడిని కలవడానికి కిమ్ గ్రామానికి వెళ్లింది. బాలిక, ఆమె మగ స్నేహితుడు మోటా బోర్సారా గ్రామ సమీపంలోకి రాగానే మార్గం మధ్యలో నిర్జన ప్రదేశంలో కూర్చొని ఉండగా, ముగ్గురు నిందితులు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.
బాలికపై అత్యాచారం చేసిన నిందితులు, వీరిద్దరి మొబైల్ ఫోన్లను తీసుకుని పారిపోయారు. ఈ కేసులో పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) మరియు లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (POCSO) చట్టం కింద సామూహిక అత్యాచారం మరియు ఇతర ఆరోపణలపై కేసు నమోదు చేశారు. బుధవారం సాయంత్రం నిందితులు పాశ్వాన్, చౌరాసియా పట్టుబడ్డారు. అంక్లేశ్వర్, కడోదర, అమీర్‌గఢ్, కర్జన్ వంటి ప్రాంతాల్లో ఇద్దరిపై పలు కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. చౌరాసియాపై 2017లో అంక్లేశ్వర్‌లో హత్య కేసు, 2023లో కర్జన్‌లో దొంగతనం కేసు నమోదైంది. ఈ సంవత్సరం, బనస్కాంతలోని అమీర్‌గఢ్ పోలీస్ స్టేషన్ అతనిపై ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేసింది.