ఒక వ్యక్తి తన ఇద్దరు చిన్న పిల్లలకు విషం ఇచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు. గుజరాత్‌లోని దేవభూమి ద్వారక జిల్లాలో క్యాన్సర్‌తో బాధపడుతున్న 40 ఏళ్ల వ్యక్తి తన ఇద్దరు మైనర్ పిల్లలకు విషం ఇచ్చి చంపి, తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది.
Read Also: Allegations: నా భర్తకు వేరే అమ్మాయితో సంబంధం ఉంది.. పవన్ సింగ్ రెండో భార్య సంచలన వ్యాఖ్యలు
పూర్తి వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని దేవభూమి ద్వారక జిల్లాలో క్యాన్సర్‌తో బాధపడుతున్న 40 ఏళ్ల వ్యక్తి తన ఇద్దరు మైనర్ పిల్లలకు విషం ఇచ్చి చంపి, తరువాత ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన సోమవారం సాయంత్రం లాంబా గ్రామంలో జరిగిందని కళ్యాణ్‌పూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ టిసి పటేల్ తెలిపారు. మెరామన్ భాయ్ గా గుర్తించబడిన ఆ వ్యక్తి గత ఐదు సంవత్సరాలుగా నోటి క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. ప్రస్తుతం ఆ వ్యాధి చివరి దశలో ఉంది. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో తన పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.
Read Also: UPI: రేపటి నుంచి బయో మెట్రిక్ తో యూపీఐ లావాదేవీలు
“మెరామన్ చెట్రియా అనే ఆ వ్యక్తి గత ఐదు సంవత్సరాలుగా క్యాన్సర్‌తో బాధపడుతూ తన మరణాన్ని చూస్తూ ఉండటంతో తన జీవితాన్ని ముగించాలని నిర్ణయించుకున్నాడు. తన మరణం తర్వాత తన చిన్న పిల్లల భవిష్యత్తు గురించి అతను నిరంతరం ఆందోళన చెందాడు” అని పోలీసులు తెలిపారు. చేతారియా తన 5 సంవత్సరాల కుమార్తె ఖుషి మూడేళ్ల కుమారుడు మాధవ్‌లకు విషం ఇచ్చి.. అనంతరం ఆ విషాన్ని తానూ తాగాడు. ఆ సమయంలో అతని భార్య పని మీద బయటకు వెళ్ళింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
