Site icon NTV Telugu

Brother Murders Sister: దారుణం.. లవర్ తో కనిపించడంతో.. సొంత చెల్లెలినే..

Untitled Design (40)

Untitled Design (40)

ఉత్తర ప్రదేశ్ లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. తన సొంత చెల్లెలిని కాలువలో ముంచి చంపాడు అన్న. తన చెల్లెలి ప్రేమ వ్యవహారంతోనే ఈ హత్యజరిగినట్లు సమాచారం. అనంతరం నిందితుడు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు.

Read Also:Shocking Video: మరీ ఇలా తయారయ్యారేంటమ్మా.. అత్తపై కోడలు దాడి

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లా కాంపియర్‌గంజ్‌లోని భౌరబారి గ్రామంలో ఆదిత్య యాదవ్ అనే యువకుడు తన సొంత చెల్లె అయిన నిత్య యాదవ్ ను నీటిలో ముంచి హత్య చేశాడో అన్న. తన చెల్లెలు ఒక అబ్బాయితో ప్రేమ వ్యవహారం నడపడమే ప్రధాన కారణమని పోలీసులు తెలిపారు. గతంలో సోదరికి ఎన్నో సార్లు చెప్పి చూసిన వినక పోవడంతో ఆమెపై కోపం పెంచుకున్నాడు ఆదిత్య.

Read Also:Tragedy: మొదటి భర్త యాసిడ్ పోశాడు.. రెండో భర్త రోడ్డుపై వదిలేశాడు..

నిందితుడు ఆదిత్య యాదవ్ సోమవారం తన 19 ఏళ్ల సోదరి నిత్య యాదవ్‌ను హత్య చేశాడు. నిత్య ఇంటర్మీడియట్ విద్యార్థిని. గత మూడు సంవత్సరాలుగా ఒక వ్యక్తితో ప్రేమలో ఉంది. ఈ విషయం కాస్త ఆదిత్య యాదవ్ కు తెలియడంతో.. నిత్య యాదవ్ నచ్చచెప్పేందుకు ప్రయత్నించాడు. కానీ ఆమె తన మాట వినలేదు. ఆదివారం నిత్య యాదవ్ ఎవరికి చెప్పకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. రాత్రి అయినప్పటికి తను ఇంటికి రాకపోవడంతో చుట్టుపక్కలా అంతా వెతికారు. సోమవారం ఉదయం ఆమె ఓ యువకుడితో రెస్టారెంట్ లో కనిపించింది.

మొదట ఆదిత్య తన చెల్లెలిని ఇంటికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. ఆమె మాత్రం యువకుడిని వదిలి రానని చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం ఆమెను మాట్లాడదామని ఓ ఏకాంత ప్రదేశానికి తీసుకుని వెళ్లాడు. అక్కడ ఆమెను కొట్టి.. అనంతరం కాలువలో ముంచి చంపేశాడు. హత్యానంతరం.. ఆదిత్య మృతదేహం ముందు దాదాపు గంటన్నరకు పైగా కూర్చున్నాడు. తర్వాత పీఎస్ కు వెళ్లి.. తాను తన చెల్లెలిని హత్య చేశానని చెప్పి లొంగిపోయాడు.

Read Also:Delhi: విదేశీ కోచ్‌లపై వీధికుక్కల దాడి.. ఇది దేశ ప్రతిష్టకు మచ్చ-బీజేపీ లీడర్

నిందితుడు నేరం అంగీకరించాడని స్టేషన్ హౌస్ ఆఫీసర్ రోషన్ సింగ్ తెలిపారు. తన తండ్రి మరణం తర్వాత, తన సోదరీమణులు. తమ్ముడిని చూసుకుంటూ, కూలీగా పనిచేస్తున్నానని ఆదిత్య తెలిపాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం పరీక్ష కోసం బిఆర్‌డి మెడికల్ కాలేజీకి పంపారు .. అనంతరం కేసు నమోదు చేసుకున్నపోలీసులు విచారణ చేపట్టారు.

Exit mobile version