Site icon NTV Telugu

Crime: ఆన్‌లైన్‌లో పరిచయం.. మైనర్ బాలికపై స్నేహితుడి అత్యాచారం..

Delhi Incident

Delhi Incident

Crime: ఆన్‌లైన్, సోషల్ మీడియా పరిచయాలు అఘాయిత్యాలకు దారి తీస్తున్నాయి. స్నేహితుల పేరుతో మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి కేసులు ఇప్పటి వరకు చాలానే నమోదయ్యాయి. తాజాగా మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీకి చెందిన ఓ మైనర్ బాలికపై ఆమె స్నేహితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. నగరంలోని దబ్రీ మెట్రోస్టేషన్ సమీపంలో బాలిక అపాస్మారక స్థితిలో కనిపించిందని పోలీసులు బుధవారం వెల్లడించారు.

Read Also: Rajya Sabha Elections: రాజ్యసభ ఎన్నికల తర్వాత ఏ పార్టీ బలం ఎంత..? బీజేపీ మెజారిటీ సాధించిందా..?

బాలిక కథనం ప్రకారం.. మంగళవారం మెట్రో స్టేషన్ సమీపంలో స్పృహతప్పి పడిపోయింది. ఆమెను కొట్టి అక్కడ పడేసినట్లు పోలీసులు గతంలో చెప్పారు. మైనర్ అయిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో పరిచయమైన నిందితుడిని బాలిక కలవాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఆ తర్వాత ఆమెపై అత్యాచారం జరిగింది. ఈ దారుణం తర్వాత బాలిక ఇంటికి తిరిగి రావడానికి రిక్షా తీసుకుని మెట్రో స్టేషన్ రాగానే స్పృహతప్పి పడిపోయిందని పోలీస్ అధికారులు వెల్లడించారు.

బాలిక తన కోచింగ్ క్లాస్‌కి వెళ్లిన తర్వాత స్నేహితుడిని కలిసింది. ఆ తర్వాత అతను అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక పరిస్థితిని గమనించిన బాటసారులు ఆమెను ఆస్పత్రికి తరలించి, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. జరిగిన దారుణాన్ని బాలిక కుటుంబ సభ్యలుకు వివరించడంతో, వారు పోలీసులకు సమాచారం అందించారు. ఈ కేసుపై విచారణ కొనసాగుతోంది.

Exit mobile version