NTV Telugu Site icon

Shocking: బాయ్‌ఫ్రెండ్‌తో పెళ్లికి ఒప్పుకోలేదని.. 13 మందికి విషం పెట్టి చంపిన యువతి..

Shocking

Shocking

Shocking: పాకిస్తాన్‌లో దారుణం జరిగింది. తాను ఇష్టపడిన అబ్బాయితో పెళ్లికి అడ్డు చెబుతున్నారని ఓ యువతి ఏకంగా మొత్తం కుటుంబాన్నే కడతేర్చింది. ఈ ఘటన సింధ్ ప్రావిన్సులోని ఖైర్‌పూర్ సమీపంలోని హైబత్ ఖాన్ బ్రోహి గ్రామంలో ఆగస్టు 19న చోటు చేసుకుంది. తనకు నచ్చిన అబ్బాయితో పెళ్లికి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతోనే ప్రియుడితో కలిసి యువతి కుట్ర పన్నింది.

నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. తన బాయ్‌ఫ్రెండ్‌తో పెళ్లి జరిపించాలని యువతి కుటుంబ సభ్యులను కోరినప్పటికీ, వారు దానికి అంగీకరించలేదు. దీంతో వీరందర్ని చంపేందుకు గోధుమ పిండిలో విషం కలిపి, చపాతీలు చేసి 13 మంది కుటుంబ సభ్యులకు వడ్డించింది. వీటిని తిన్న తర్వాత వారంతా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అందరు మరణించారు.

Read Also: Nithya Pellikoduku: చదివింది తొమ్మిది.. మోసాలలో మాత్రం పీహెచ్‌డీ చేశాడు.. నిత్య పెళ్లికొడుకు ఆటకట్టించిన పోలీసులు

ఆగస్టు 19న రాత్రి భోజనం చేసిన తర్వాత వెంటనే 9 మంది కుటుంబ సభ్యులు మరణించగా, మరో నలుగురు మరుసటి రోజు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. షైస్తా బ్రోహిని అనే యువతిని ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అమీర్ బక్ష్‌తో షైస్తా ప్రేమలో ఉందని తేలింది. తమ పెళ్లికి కుటుంబం అంగీకరించలేదని చెప్పింది. అమీర్ తనకు ఓ లిక్విడ్ ఇచ్చి ఆహారంలో కలపమని చెప్పినట్లు వెల్లడించింది. ఇది తిన్న తర్వాత మీ కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరిస్తారని అతను చెప్పినట్లు తెలిపింది. ప్రస్తుతం షైస్తా, అమీర్ బక్ష్‌లను అరెస్ట్ చేశారు.

పోస్ట్ మార్టం నివేదికలో విష ప్రయోగం జరిగినట్లు తేలింది. పోలీసుల విచారణలో కూతురే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తేలింది. ఇంట్లో రోటీలు తయారు చేసే పిండిలో విషం కలిపినట్లు తేలిందని ఖైర్‌పూర్‌కు చెందిన సీనియర్ పోలీసు అధికారి ఇనాయత్ షా తెలిపారు. ఈ హత్యలకు యువతి, ఆమె లవర్ కలిసి ప్లాన్ చేసినట్లు వెల్లడించారు. తన ప్రియుడి సాయంతోనే విష ప్రయోగం చేసినట్లు యువతి అంగీకరించినట్లు చెప్పారు.

Show comments