NTV Telugu Site icon

Crime: 13 ఏళ్ల బాలికపై స్కూల్ ప్యూన్ అత్యాచారం.. గర్భం దాల్చడంతో వెలుగులోకి దారుణం..

Crime

Crime

Crime: దేశవ్యాప్తంగా రోజూ ఎక్కడో చోట అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కోల్‌కతా డాక్టర్ ఘటన ఇప్పటికే దేశంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అత్యాచారాలకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్న క్రమంలోనే పలు ప్రాంతాల్లో బాలికలు, మహిళలు అత్యాచారాలకు గురవుతూనే ఉన్నారు. పోక్సో, నిర్భయ వంటి చట్టాలు ఉన్నప్పటికీ కామాంధుల తీరులో మార్పు రావడం లేదు. చాలా వరకు లైంగిక దాడులు తెలిసిన వారి నుంచే జరుగుతున్నాయి.

Read Also: Gaza War: ఆరుగురు ఇజ్రాయిలీ బందీలను హత్య చేసిన హమాస్..

ఇదిలా ఉంటే, ఉత్తర్ ప్రదేశ్ ఫరూఖాబాద్‌లో 13 ఏళ్ల బాలికపై ప్రభుత్వ పాఠశాల ప్యూన్, అతడి సహచరుడు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఐదు నెలల తర్వాత బాలిక గర్భవతి అని తేలడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. శనివారం బాలిక గర్భం దాల్చినట్లు గుర్తించిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్ని నెలల క్రితం బాలిక రాత్రి వాష్‌రూమ్‌కి వెళ్లిందని, పాఠశాలలో పనిచేసే పంకజ్ మరియు అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి అమిత్ ఆమెను పట్టుకుని, ఖాళీగా ఉన్న ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ అమిత్ బాలికపై అత్యాచారం చేయగా, పంకజ్ బయట కాపలాగా ఉన్నాడు.

ఈ ఘటన జరిగిన తర్వాత విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బాలికను నిందితులు బెదిరించారు. అయితే, శనివారం రోజు బాలిక ఐదు నెలల గర్భవతి అని తల్లి గుర్తించడంతో విషయం తెలిసింది. నిందితులపై అత్యాచారం ఆరోపణలతో పాటు లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ కల్పించే పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటనలో ఇంకా ఎవరిని అరెస్ట్ చేయలేదని అధికారులు తెలిపారు.

Show comments