Delhi: దేశంలో ప్రతీ రోజు ఎక్కడో చోట అత్యాచార ఘటన వెలుగులోకి వస్తూనే ఉంది. చాలా సందర్భాల్లో తెలిసిన వారి నుంచి బాలికలు, మహిళలు లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చిన్నారులు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ కు తేడా తెలియకపోవడంతో మృగాళ్లు రెచ్చిపోతున్నారు. చాలా సందర్భాల్లో పరువు కారణంగా కొన్ని కేసులు బయటకు రావడం లేదు. మరోవైపు అత్యాచారాలు, లైంగిక నేరాలకు ప్రభుత్వాలు నిర్భయ, పోక్సో వంటి చట్టాలను తీసుకుని వచ్చినా.. అఘాయిత్యాలకు అడ్డుకట్టపడటం లేదు. తాజాగా ఢిల్లీలో బాధ్యతాయుతం అయిన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వ్యక్తి మైనర్ విద్యార్థిని పట్ల దుర్మార్గంగా వ్యవహరించాడు.
Read Also: SRH vs DC: ఢిల్లీ గడ్డపై సన్‌రైజర్స్ దండయాత్ర.. డీసీ ముందు భారీ లక్ష్యం
ఉపాధ్యాయ వృత్తికి కలంకం తెచ్చాడో నీచుడు. ఈశాన్య ఢిల్లీలో యమునా విహార్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 11 ఏళ్ల బాలికపై ఉపాధ్యాయుడు లైంగిక వేధింపుకలు పాల్పడ్డాడు. పాఠశాలలో ల్యాబ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న రాజీవ్(37) బాలికను లైంగికంగా వేధించినట్లు పోలీసులు వెల్లడించారు. 6వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై దుర్మార్గపు చర్యకు ఒడిగట్టిన నిందితుడిని శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఘజియాబాద్ లోని నిందితుడి ఇంటిలోని అతడిని అదుపులోకి తీసుకున్నారు. రాజీవ్ గత ఐదేళ్లుగా పాఠశాలలో పనిచేస్తున్నాడు. చిన్నారిని లైంగికంగా వేధించడంతో భజన్ పురా పోలీస్ స్టేషన్ లో ఐపీసీ, పోక్సో చట్టాల కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు.