Site icon NTV Telugu

Crime: బాయ్‌ఫ్రెండ్‌ని నమ్మి వెళ్తే.. 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం..

Crime

Crime

Crime: బాయ్‌ఫ్రెండ్ నమ్మి వెళ్లిన బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన యూపీలోని ఘజియాబాద్‌లో జరిగింది. 16 ఏళ్ల బాలికపై ఆమె ప్రియుడు, అతని ముగ్గురు స్నేహితులు గ్యాంగ్‌ రేప్‌కి పాల్పడినట్లు పోలీసులు శనివారం తెలిపారు. ప్రియుడితో పాటు అతని ఇద్దరు మైనర్ స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బాలిక లవర్‌ని చాంద్‌గా గుర్తించారు.

Read Also: IND vs BAN 3rd T20: టీ20 ఫార్మాట్‌లో భారత్‌ది రెండో అత్యధిక స్కోర్.. మొదటి స్థానంలో ఉన్న టీం ఇదే..

అక్టోబర్ 07న చాంద్ తన ఫ్రెండ్ ఆఫీసుకి బాలిక వచ్చేలా ప్లాన్ చేశాడు. బాలిక అక్కడి చేరగానే, లవర్ అతని ముగ్గురు కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన గురించి ఎవరికైనా చెబితే చంపేస్తామని నిందితుడు బెదిరించినట్లు ఏసీపీ సూర్య బాలి మౌర్య తెలిపారు. తనకు జరిగిన అన్యాయంపై బాలిక అక్టోబర్ 10న ట్రోనికా సిటీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాలిక చెప్పిన వివరాల ప్రకారం.. వావి సాదిక్‌పూర్‌లో నివసించే చాంద్‌తో తనకు రిలేషన్ ఉందని, పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడని, అయితే ఆమెను లైంగిక సంబంధం కోసం బలవంతం చేశాడని చెప్పారు.

భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 70(2) (18 ఏళ్లలోపు మహిళపై సామూహిక అత్యాచారం) మరియు పోక్సో చట్టంలోని సెక్షన్ 5 జి/6 (తీవ్రమైన లైంగిక వేధింపులు) కింద నిందితులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు ఏసీపీ తెలిపారు. చంద్‌ని అరెస్ట్ చేశామని..ఇద్దరు బాల నేరస్తులను అరెస్ట్ చేశామని, మూడో మైనర్ నిందితుడు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.

Exit mobile version